Begin typing your search above and press return to search.

ఖలిస్థాన్ పై కెనడాలో రెఫరెండం.. మరో దుమారం?

By:  Tupaki Desk   |   20 Sep 2022 4:50 PM GMT
ఖలిస్థాన్ పై కెనడాలో రెఫరెండం.. మరో దుమారం?
X
సిక్కు వేర్పాటు వాదుల ‘ఖలిస్థాన్’ లొల్లి ఇప్పటిది కాదు.. దశాబ్ధాలుగా వారు తమకు సొంత దేశం కావాలంటూ పోరాడుతున్నారు. తమకంటూ ఓ ప్రత్యేక దేశం కావాలంటూ భారత ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కెనడాలో చాలా ఎక్కువమంది సిక్కులు ఉన్నారు. ఈక్రమంలోనే సిక్కు వేర్పాటువాదులు తాజాగా కెనడా దేశంలో ‘ఖలిస్తాన్’పై ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించడం దుమారం రేపింది. ఇది భారత్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది.

లక్షలమంది కెనడియన్ సిక్కులు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కలిస్తాన్ అనుకూల గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జీ) కెనడాలోని బ్రాంప్టన్ లో దీనిని నిర్వహించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఎస్ఎఫ్.జీని 2019లో భారత ప్రభుత్వం నిషేధించింది.

దేశానికి వ్యతిరేకంగా కెనడాలో జరుగుతున్న ఈ రెఫరండంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ చర్యను అడ్డుకోవాలని కాస్తాంత ఘాటుగానే కెనడాకు స్పష్టం చేసింది. అయితే కెనడా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. వారు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తమ భావాలను వ్యక్తీకరిస్తున్నారని.. చట్టపరిధిలో వారు చేస్తున్న ఈ చర్యలను అడ్డుకోలేమని తేల్చిచెప్పింది.

పంజాబ్ లో సిక్కులతో కూడిన ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఎస్ఎఫ్.జే ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. పంజాబ్ ప్రజల్లో కనుక ఒకసారి ఏకాభిప్రాయం కుదిరితే అప్పుడు తాము పంజాబ్ ను ప్రత్యేక దేశంగా పున: స్థాపించాలనే డిమాండ్ తో ‘ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సమాజాన్ని కలుస్తామని’ రెఫరెండం 2020 నిర్వహించిన సభ్యులు స్పష్టం చేశారు.

కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదులు గతవారం టొరంటో లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిరంపై విరుచుకుపడి అపవిత్రం చేవారు. కెనడా ప్రభుత్వం దీన్ని ఖండించింది. కానీ అక్కడి ఖలీస్థానీ నేతలు మాత్రం దీన్ని ఉద్యమంగా మలుస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.