Begin typing your search above and press return to search.

వారికి అది ఉంటే చాలంట..సెక్స్ కూడా అక్కర్లేదంట

By:  Tupaki Desk   |   13 Oct 2015 10:30 PM GMT
వారికి అది ఉంటే చాలంట..సెక్స్ కూడా అక్కర్లేదంట
X
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. జీవితంలో చాలా విషయాల కంటే కూడా సెక్స్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ వైఖరి ఏ ఒక్కదేశానికో కాదు.. చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉంటుంది. తమ ప్రాధామ్యాలలో సెక్స్ కు కచ్ఛితంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ.. కెనడా ప్రజలు మాత్రం అందుకు భిన్నమంట. వారికి సెక్స్ కంటే కూడా ముఖ్యమైనది మరొకటి ఉందట.

తాజాగా చేపట్టిన ఒక సర్వేలో వెల్లడైన వాస్తవాల్ని చూసి విస్మయం చెందుతున్నారు. కెనడా ప్రజలకు పంది మాంసం ఉంటే.. మరింకేమీ అక్కర్లేదని తేల్చారు. సర్వేలో పాల్గొన్న దాదాపు 43 శాతం మంది సెక్స్ కంటే కూడా పందిమాసం తినటానికే తాము ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారంట.

అంతేకాదు.. నచ్చిన వాసన ఏమిటంటే.. పువ్వులు.. సుగంధ ద్రవ్యాలో కాకుండా వంట వాసననే ఎక్కువ ఇష్టపడతామని చెప్పారట. సెక్స్ కన్నా మజా ఇచ్చేది పంది మాంసంలో ఏముంటుందన్న ఆశ్చర్యాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అదేంటో కెనడియన్లకు మాత్రమే తెలుసునేమో.