Begin typing your search above and press return to search.
కరోనా దెబ్బకు ప్రధాని వర్క్ ఫ్రం హోం
By: Tupaki Desk | 14 March 2020 7:30 PM GMTప్రపంచదేశాలను గడగడలాడిస్తోన్న కరోనా ధాటికి దేశాధ్యక్షులు కూడా వణికిపోతోన్న సంగతి తెలిసిందే. శరవేగంగా వ్యాపిస్తూ తన ప్రతాపం చూపుతోన్న ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 5 వేలమందికి పైగా మరణించారు. తనకు కరోనా లేదని ...కానీ ముందు జాగ్రత్త చర్యగా టెస్ట్ చేయించుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇక, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తన భార్యను ఐసోలేషన్ గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. తనతో సహా ముగ్గురు పిల్లలకు కరోనా లక్షణాలు లేవన్న ట్రుడో...ప్రస్తుతం తాను ఇంటి దగ్గర నుంచే అధికారిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నానని తెలిపారు. ఫోన్ కాల్స్, ప్రభుత్వ కార్యకలాపాలు, దేశాధినేతలతో సమావేశాలు అన్నీ ఆన్ లైన్లో జరుపుతున్నానని చెప్పారు.
అయితే, ఇలా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు ఇంటి దగ్గర నుంచి నిర్వహించడంలో ట్రుడో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీడియా లో కథనాలు వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ వల్ల ప్రజా సమస్యలు తీర్చడం లో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రుడో చెప్పినట్లు బ్రిటన్ కు చెందిన ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ట్రుడో అన్ని విదేశీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని, ఒట్టావో లో జరగాల్సిన సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నారని తెలిపింది. కెనడాలో కేవలం పరిమిత సంఖ్యలో విమానాశ్రయాలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించిందని కెనడా అధికారులు తెలిపారు.
మరోవైపు, కరోనా వల్ల కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌కు 5 వారాలు సెలవులు ప్రకటించాలని ట్రుడో యోచిస్తున్నారట. కెనడాలో కరోనా బాధితులు 100 మంది వరకు ఉండగా...ఒకరు మృతి చెందారు. కరోనాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా క్రీడా, వినోద ఈవెంట్లను రద్దు చేశారు.