Begin typing your search above and press return to search.

కెన‌డాకు వెళ్లాల‌నుకుంటే...ఇదే గొప్ప టైం!

By:  Tupaki Desk   |   17 May 2020 11:30 AM GMT
కెన‌డాకు వెళ్లాల‌నుకుంటే...ఇదే గొప్ప టైం!
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా సంక్షోభంతో పాటు అమెరికా వలస నిబంధనలను కఠినతరం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో విద్య అభ్య‌సించాల‌నుకునే విద్యార్థులు ప్ర‌త్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఏ దే‌శాల్లో మెరుగైన ఉద్యోగ - ఉపాధి అవ‌కాశాలు ఉన్నాయా? అని అన్వేషిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలోనే...విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు కెనడా ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వర్క్‌ పర్మిట్‌ (పీజీడబ్ల్యూపీ)’ నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. ఇవి ఇండియ‌న్ విద్యార్థుల‌కు భారీగా క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

‘పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ వర్క్‌ పర్మిట్‌ (పీజీడబ్ల్యూపీ)’ ద్వారా కెనడాలోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కోర్సు పూర్తిచేసి అనంతరం అక్కడే ఉద్యోగం చేయ‌వ‌చ్చు. దీనికి అర్హత సాధించాలంటే విదేశీ విద్యార్థులు కనీసం 8 నెలల ఫుల్‌ టైమ్‌ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్సును బట్టి వర్క్‌ పర్మిట్‌ గడువు ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు కెనడా పీజీడబ్ల్యూపీ నిబంధనలను సరళీకరించింది. సాధారణంగా పీజీడబ్ల్యూపీకి ఆన్‌ లైన్‌ కోర్సులను పరిగణనలోకి తీసుకోరు. అయితే కరోనా కారణంగా అంతర్జాతీయ రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఈ నిబంధనలను కూడా సడలించడం గ‌మ‌నార్హం.

స్వదేశంలో ఉంటూనే కెనడా విద్యాసంస్థల్లో ఆన్‌ లైన్‌ కోర్సులు చదివేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 50 శాతం వరకు విదేశాల్లోనే కోర్సు పూర్తిచేసినా - గ్రాడ్యుయేషన్‌ అనంతరం పీజీడబ్ల్యూపీకి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది. అలాగే కోర్సు సందర్భంగా విద్యార్థులు తమ స్వదేశంలో గడిపిన సమయాన్ని పీజీడబ్ల్యూపీ గడువు నుంచి కూడా తగ్గించరు. డిసెంబర్‌ 31 వరకు ఇది వర్తిస్తుంది. వచ్చే వర్షాకాలం నుంచి విదేశీ విద్యార్థులు కెనడా విద్యాసంస్థల్లో ఆన్‌ లైన్‌ కోర్సులను ప్రారంభించవచ్చు. ఇంకే విదేశీ విద్య అభ్య‌సించాల‌నుకునే వారు కెన‌డాను ఎంచుకోవ‌చ్చు.