Begin typing your search above and press return to search.

మెద‌డు రోజుకు ఎన్ని ఆలోచ‌న‌లు చేస్తుందో తెలుసా..?

By:  Tupaki Desk   |   21 July 2020 1:30 AM GMT
మెద‌డు రోజుకు ఎన్ని ఆలోచ‌న‌లు చేస్తుందో తెలుసా..?
X
మ‌న శ‌రీరం నిద్రావ‌స్థ‌లో ఉన్నా కూడా అవ‌య‌వాలు ప‌ని చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మెద‌డు.. గుండె నిత్యం ప‌ని చేస్తుంటాయి. అవి ప‌ని చేయ‌డం ఆగిపోతే మ‌న‌లో జీవం లేన‌ట్టే. మ‌న‌సు.. మెద‌డు రెండూ ఒక‌టే. ఆ రెండు ఆలోచ‌న‌లు చేస్తుంటాయి. మ‌న‌సు మ‌న‌కు ఇష్ట‌మైన విష‌యం చెబుతుండ‌గా మెద‌డు ఏదో మంచో ఏదో చెడో చెబుతుంది. ఆ విధంగా నిత్యం ఆలోచ‌న‌లు మ‌న బుర్ర‌లో రేగుతుంటాయి. మ‌న మెద‌డు ఎప్పుడు ఆలోచ‌న‌ల‌తో తిరుగుతూనే ఉంటుంది. అలాంటి ఆలోచ‌న‌ల‌పై తాజాగా శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం చేశారు. దానిలో షాకింగ్ విష‌యం తెలిసింది. ఒక మనిషి రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తాడని అధ్య‌య‌నం చేస్తే ఆశ్చ‌ర్య‌ప‌డేలా స‌మాధానం దొరికింది. ఇప్ప‌టివ‌ర‌కు 200 నుంచి 300 వరకు ఆలోచనలు చేస్తాడని భావించాం. కానీ దానికి రెట్టింపు స్థాయిలో ఏకంగా 6 వేల వ‌ర‌కు ఆలోచ‌న‌లు చేస్తాడ‌ని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ విష‌యాన్ని కెనడాలోని క్వీన్స్‌‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్ర‌క‌టించారు.

ఆ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఓ వ్యక్తి ఆలోచనలపై అనేక రకాల పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలలో అనేక విషయాలను వెల్లడించారు. ఒక మనిషి సగటున రోజుకు 6 వేల వరకు ఆలోచనలు చేస్తాడని కెనడా క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. రోజుకు మనిషి ఎన్ని ఆలోచనలను లెక్కించడం కోసం శాస్త్రవేత్తలు పలువురు వ్యక్తులను పరీక్షించారు. మెద‌డు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుందో అప్పుడు నిద్రలో కూడా రకరకాల ఆలోచనలు వస్తుంటాయని పరిశోధనలో తెలిసింది. దీంతో పాటు మనిషి చేసే ఆలోచనలు లెక్కించడం కోసం శాస్త్ర‌వేత్త‌లు ఓ కొత్త పద్ధ‌తిని కూడా ప్రవేశ పెట్టారు.

దాని పేరే ‘థాట్ వర్మ్’. రోజులో మనిషి ఆలోచన మొదలైనప్పటి నుంచి చివరి ఆలోచన వరకు ఈ పద్ధ‌తి ద్వారా లెక్కించి ఆ సంఖ్యను నిర్ధారించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విధంగా లెక్కించ‌గా ఆలోచనల సంఖ్య ఆరు వేల వరకూ ఉంటుంద‌ని కెనడా క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వివ‌రిస్తున్నారు. ఈ విధంగా మ‌న మెద‌డు ఎంత వినియోగించుకుంటే అంత ప‌ని చేస్తుంది. రోజుకు అన్ని ఆలోచ‌న‌లు వ‌స్తే మ‌న జీవితమే మారిపోతుంది. అందుకే నిరంత‌రం కొత్త కొత్త విష‌యాలు తెలుసుకుంటూ మెద‌డును చురుకుగా ఉంచితే ఎన్నో అద్భుతాలు సాధించ‌వ‌చ్చు. మెద‌డును సాన‌బెట్టండి.