Begin typing your search above and press return to search.

ఒక దేశం తర్వాత మరో దేశం క్లీన్‌చిట్‌ ఇస్తోందే

By:  Tupaki Desk   |   3 July 2015 2:37 PM GMT
ఒక దేశం తర్వాత మరో దేశం క్లీన్‌చిట్‌ ఇస్తోందే
X
రెండు నిమిషాల మ్యాగీ దేశంలో రేపిన కలకలం అంతాఇంతా కాదు. ప్రముఖ బహుళజాతి వినిమయ ఉత్పత్తుల సంస్థ నెస్లే పేరు ప్రతిష్ఠల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన మ్యాగీకి సంబంధించి.. ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వస్తోంది.

ఆరోగ్యాన్ని హాని చేసే హానికారక రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలతో మ్యాగీపై దేశవ్యాప్తంగా నిషేధం విధించటం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా రచ్చ రచ్చ సాగుతున్న సమయంలో పొరుగున ఉన్న సింగపూర్‌లో మ్యాగీకి క్లీన్‌చిట్‌ లభించటం తెలిసిందే. అయితే.. భారత్‌లో ఈ ఉత్పత్తిపై ప్రతికూల ప్రచారం సాగుతున్న హోరులో ఈ విషయం పెద్దగా ఫోకస్‌ కాలేదు.

అయితే.. సింగపూర్‌ తర్వాత ఇటీవల బ్రిటన్‌ కూడా మ్యాగీ సురక్షితమని.. దాన్ని వినియోగించటం వల్ల ఎలాంటి అరోగ్య సమస్యలు ఎదురుకావని తేల్చింది. తాజాగా.. మ్యాగీ సురక్షితం అంటూ కెనడా ప్రభుత్వం కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆహారపదార్థాలకు సంబంధించి అత్యంత కఠినంగా వ్యవహరించే పశ్చిమ దేశాలు ఒకటి తర్వాత ఒకటిగా మ్యాగీకి క్లీన్‌చిట్‌ ఇవ్వటం ఇప్పుడు పెద్ద వార్తగా మారింది.

ఇదే సమయంలో.. ఈ ఉత్పత్తులు అన్నీ ఆయా దేశాల్లో తయారు చేశాయన్న వాదనను కొట్టిపారేస్తూ.. ఆయా దేశాలు క్లీన్‌చిట్‌ ఇచ్చిన మ్యాగీ శాంపిళ్లు భారత్‌లో తయారు చేసినవవిగా చెబుతున్నారు. ఈ ఉత్పత్తులు యూరోపియన్‌ యూనియన్‌ అనుమతించిన స్థాయిలోనే రసాయనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. మరి.. దీనిపై సాగుతున్న రచ్చలో అత్యంత కీలకమైన ఎంఎస్‌జీ అనే రసాయనం వాడుతున్నట్లుగా పాకెట్‌ మీద ముద్రించకున్నా అందులో వాడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మరి.. ఇలాంటి వాదనకు భిన్నంగా మ్యాగీకి పలు దేశాలు సురక్షితం అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించటంతో భారత్‌లో దీనిపై జరుగుతున్న ప్రచారం.. నిషేధం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఉత్పత్తుల నాణ్యత పట్ల ఇంతవరకు బహిరంగంగా చర్చలో పాల్గనని నెస్తే.. తాజా పరిస్థితుల్లో ఏం చేస్తుందో చూడాలి..?