Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ కోసం కక్కుర్తి పడి సీఈవో జాబ్ పోగొట్టుకొని.. కేసు తగిలించుకున్నాడు
By: Tupaki Desk | 27 Jan 2021 12:30 PM GMTఆశ.. మహా చెడ్డది. ఇంతకాలం జాగ్రత్తగా ఉన్నట్లే.. మరికాస్త సమయం కేర్ ఫుల్ గా ఉంటే సరిపోయేదానికి.. కక్కర్తుకి పోయి ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవటమే కాదు.. బంగారం లాంటి జాబ్ పోగొట్టుకున్నాడు. అంతేనా.. కేసు నమోదు చేయించుకొని అప్రదిష్ట పాలయ్యాడు. ఇన్నింటిని పోగొట్టుకున్న ఈ పెద్ద మనిషి.. దేని కోసం అంతగా ఆశ పడ్డారో తెలిస్తే సాక్ అవ్వాల్సిందే. ఓపక్క వ్యాక్సిన్ మీద బోలెడన్ని సందేహాలు వస్తున్న వేళ.. టీకా ఎంత ఆలస్యమైతే.. అంత మంచిదన్నట్లుగా ఉన్నారు.
కానీ.. కెనడియన్ సీఈవో మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. చివరకు బంగారం లాంటి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఇంతకూ అసలేం జరిగిందో చూస్తే.. బిలియన్ డాలర్ల విలువ చేసే క్యాసినో కంపెనీకి సీఈవో వ్యవహరిస్తున్నారు రాబ్ బేకర్. అతను.. అతని సతీమణి ఇద్దరు కోవిడ్ వ్యాక్సిన్ ను అర్జెంట్ గా వేయించుకొని.. తాము ఫుల్ సేఫ్ గా మారిపోయేందుకు భారీ ప్లాన్ వేశారు. ఇందుకోసం తాము ఉన్న ప్రాంతం నుంచి దూరంగా ఉన్న ఊరికి బయలుదేరారు.
150 మంది కూడా జనాభా లేని ప్రాంతానికి వెళ్లిన వీరిద్దరూ.. అక్కడే ఒక మోటల్ లో బస చేశారు. తామిద్దరం మోటెల్ లో కూలీ పనులు చేసుకుంటామని అబద్ధం చెప్పారు. దీంతో.. వారిద్దరికి అధికారులు మోడెర్నా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అనంతరం వారు అక్కడి నుంచి బయలుదేరారు. అయితే.. వీరి తీరుపై అనుమానం వచ్చిన అధికారులు క్రాస్ చెక్ చేశారు. దీంతో.. వారిద్దరి బండారం బయటకొచ్చింది. రాడ్ బేకర్ దంపతులు ఇద్దరూ మోటెల్ లో పని చేసే వారు కాదన్న విషయాన్ని గుర్తించిన అధికారులు వారిని ప్రశ్నిచారు.
దీంతో తమ తప్పును ఒప్పుకున్నారు ఆ దంపతులు. వ్యాక్సిన్ కోసం మోటెల్ కార్మికులుగా మారిన వైనాన్ని వెల్లడించారు. ఈ వ్యవహారం మీడియాలో అక్కడ రచ్చ అయ్యింది. అతగాడి కక్కుర్తి మీద స్థానిక మీడియా సంస్థలు పెద్ద ఎత్తున స్పందించాయి. దీనిపై యుకాన్ కమ్యునిటీ సిర్వీసెస్ మంత్రి జాన్ స్పందించారు. అడ్డదారిలో వ్యాక్సిన్ వేయించుకునే వారి పరువు పోవటమే కాదు.. అనవసరంగా కేసు మీద వేసుకొని.. ఇబ్బంది పడుతున్నారు. ముందుగా టీకా వేసుకోవాలన్న కక్కుర్తి ఆ దంపతుల్ని కొత్త కష్టాల బాటలో నడిచేలా చేసిందని చెప్పక తప్పదు.