Begin typing your search above and press return to search.

క‌న్న‌డ వాసుల‌కు మోదీ మైండ్ బ్లాంక‌య్యే షాక్‌

By:  Tupaki Desk   |   31 Aug 2019 8:30 AM GMT
క‌న్న‌డ వాసుల‌కు మోదీ మైండ్ బ్లాంక‌య్యే షాక్‌
X
ఇటీవ‌లే క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు షాకిచ్చారు. ప్ర‌భుత్వరంగ బ్యాంకులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి - బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడంలో భాగంగా ప‌ది బ్యాంకుల‌ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ)లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) - యునైటెడ్ బ్యాంకులు విలీనమవనుండగా - కెనరా బ్యాంక్‌ లో సిండికేట్ బ్యాంక్ - యూనియన్ బ్యాంక్‌ లో ఆంధ్రాబ్యాంక్ - కార్పొరేషన్ బ్యాంకులు - ఇండియన్ బ్యాంక్‌ లో అలహాబాద్ బ్యాంకు కలిసిపోనున్నాయి. దీంతో 30వేలకుపైగా శాఖలు విలీనంకానున్నాయి. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకులు 27 నుంచి 12కి తగ్గనున్నాయి. అయితే, తాజాగా - బ్యాంకుల మెగా విలీనం నేపథ్యంలో రాష్ర్టానికి చెందిన నాలుగు జాతీయ బ్యాంకులు ఉనికిని కోల్పోవడంపై కన్నడ వాసులు విలవిలలాడుతున్నారు.

తాజా నిర్ణ‌యం ప్ర‌త్యేకంగా క‌ర్ణాట‌క రాష్ట్రానికి షాక్ వంటిద‌ని అంటున్నారు. దక్షిణ కర్ణాటక - పలు జాతీయ బ్యాంకులకు పుట్టినిల్లు కూడా. ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంకు - కార్పొరేషన్ బ్యాంకు - విజయ బ్యాంకు - సిండికేట్ బ్యాంకులు కర్ణాటక‌కు చెందినవే. ఈ బ్యాంకులు ప్రధానంగా ఉడిపి జిల్లా నుంచి ఆవిర్భవించడం మరో విశేషం. 1906 మార్చి 12న దక్షిణ కర్ణాటక జిల్లాలో ఏర్పాటైన తొలి బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు. ప్రముఖ ఆలయ నగరమైన ఉడిపిలో ఖాన్ బహదూర్ హాజీ అబ్దుల్లా హాజి ఖాసిం బహదూర్ సాహెబ్ దీన్ని నెలకొల్పగా 1980లో జాతీయకరణ జరిగింది.

ఇక కెన‌రా బ్యాంకు విష‌యానికి వ‌స్తే...1906 జూలైలో దక్షిణ కర్ణాటకలోని మరో నగరమైన మంగళూరులో అమ్మెంబల్ సుబ్బారావు ఈ బ్యాంకును ఏర్పాటు చేయగా 1969లో దీన్ని జాతీయం చేశారు. 1925లో ఉడిపికి చెందిన ముగ్గురు సామాజికవేత్తలు ఏర్పాటు చేసిన కెనరా ఇండస్ట్రియల్ అండ్ బ్యాంకింగ్ సిండికేట్ లిమిటెడ్ 1954లో సిండికేట్ బ్యాంకుగా రూపాంతరం చెంది 1969లో జాతీయకరణ చెందింది. 1930 నాటి ఆర్ధిక మాంద్యం పరిస్థితుల్లో రైతుల ప్రయోజనం కోసం స్థానిక రైతు ఏబీ శెట్టి విజయా బ్యాంకును ఏర్పాటు చేయగా 1980లో జాతీయకరణ జరిగింది. మొత్తంగా క‌ర్ణాట‌క‌లోని నాలుగు బ్యాంకులు విలీనం అవ‌డం...తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో వెళ్లగక్కుతున్నారు.