Begin typing your search above and press return to search.
అదే నిజమైతే ఏటీఎంలు యూజ్ లెస్సే..
By: Tupaki Desk | 28 Aug 2019 6:47 AM GMTఏటీఎంల ప్రవేశంతో నిత్య జీవితంలో ఆర్థిక లావాదేవీలు - ఆర్థిక కార్యకలాపాలు చాలా సులభమైపోయాయి. కానీ.. మెల్లమెల్లగా ఏటీఎం ట్రాంజాక్షన్లపై బ్యాంకులు నియంత్రణ పెంచసాగాయి. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు ఎక్కువవుతుండడంతో బ్యాంకులు మెల్లమెల్లగా తమ విధానాలు మార్చుకుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు మరిన్ని కొత్త మార్పులు తేనున్నాయట బ్యాంకులు. ఇవి కానీ అమలైతే ఏటీఎంలు యూజ్ లెస్సేనంటున్నారు వినియోగదారులు.
దిల్లీ రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ బ్యాంకర్లతో సమావేశమై అనేక అంశాలపై చర్చించింది. ఏటీఎమ్ ల నుంచి రోజువారీ విత్ డ్రాల నియంత్రణకు రంగం సిద్ధమైంది. బ్యాంక్ - ఏటీఎంల మోసాలు మితిమీరుతున్న నేపథ్యంలో వీటిని నియంత్రించే దిశగా బ్యాంకర్లు ప్రణాళిక సిద్దం చేశారు. దీనిప్రకారం రోజుకు ఒక్కసారి మాత్రమే ఏటీఎం విత్ డ్రాయల్ కు అనుమతించాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది. ఒక్కో ఏటీఎం లావాదేవీకి కనీసం 6 నుంచి 12గంటల కాల వ్యవధి ఉండేలా నిబంధనను చేర్చాలన్న సూచన వచ్చింది. ఇప్పటికే ఎస్ బీఐ ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణను రూ. 20 వేలకు తగ్గించింది. రూ.10 వేలకు మించి విత్ డ్రా చేసే వారికి ఓటీపీని ఎంటర్ చేయాలని కెనరా బ్యాంక్ ప్రకటించింది. కాగా దిల్లీలో ఇలాంటి విధానాలు అమలైతే తరువాత దశల్లో దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఏటీఎంలపై నియంత్రణ పెంచాలని బ్యాంకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పెద్దనోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగినప్పటికీ తాజా ప్రతిపాదనతో.. వినియోగ దారులకు తిప్పలు తప్పేలా లేవు. ఆయా బ్యాంకుల వద్ద - ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఎస్ ఎల్ బీసీ సిఫారసు చేసింది. దీంతోపాటు కమ్యూనికేషన్ ఫీచర్ తో ఏటీఎంలకు సెంట్రలైజ్ డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నివేదించింది. ఉదాహరణకు ఎవరైనా హెల్మెట్ పెట్టుకొని ఏటీఎం సెంటర్ లోకి వెళ్తే ‘హెల్మెట్ ను తొలగించండి’ అనే వాయిస్ మెసేజ్ వినిపిస్తుంది. బ్యాంక్ శాఖలలోనూ - వినియోగదారులు టెల్లర్ కు దూరంగా ఉండాలని సలహా ఇస్తుంది. అంతేకా కుండా ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతుంటే కెమెరాతో ఆ ప్రదేశాన్ని కన్నేసి ఉంచేలా సెక్యూరిటీ వ్యవస్థని రూపొందించాలని కోరింది. 2018-19 సంవత్సరంలో 179 ఏటీఎం మోసాలతో దిల్లీ రెండవ స్థానంలో ఉండగా 233 మోసాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా క్లోనింగ్ ద్వారా ఏటీఎం మోసాలు భారీగా నమోదవుతున్నాయి.