Begin typing your search above and press return to search.
నారాయణ - శ్రీచైతన్య సహా 68 కాలేజీల గుర్తింపు రద్దు
By: Tupaki Desk | 17 April 2020 4:16 PM GMTతెలంగాణలో పలు జూనియర్ కాలేజీల గుర్తింపును ఇంటర్ బోర్డు శుక్రవారం రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు చేపట్టింది. నిబంధనలు పాటించని - అనుమతులు లేని మొత్తం 68 కాలేజీల గుర్తింపును రద్దు చేసింది. ఈమేరకు ఈ మెయిల్ ద్వారా ఆయా కాలేజీలకు నోటీసులు పంపించింది. ఇందులో నారాయణ - శ్రీచైతన్య సహా పలు ప్రతిష్టాత్మక కాలేజీలు ఉన్నాయి.
26 నారాయణ కాలేజీలు - 18 శ్రీచైతన్య కాలేజీలు ఈ కాలేజీలకు నోటీసులు పంపించింది. ఈ మేరకు కాలేజీ గుర్తింపును రద్దు చేస్తూ క్లోజ్ చేస్తున్నట్లు ఆ మెయిల్ సందేశంలో పేర్కొంది. వివిధ కాలేజీలలో అక్రమాలపై విచారణ చేపట్టి గుర్తింపులేని - అనుమతులు లేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సోషల్ యాక్టివిస్ట్ రాజేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది న్యాయస్థానం. గుర్తింపు లేని కళాశాలకు సంబంధించిన వివరాలు కోర్టుకు అందించింది.
ఫైర్ డిపార్టుమెంట్ నుండి ఎన్ ఓసీ పొందని కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఇంటర్ బోర్డు. ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది. మార్చి 4వ తేదీ నుండి పరీక్షలు ఉండటంతో విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు అవి పూర్తయ్యాక చర్యలకు అనుమతించాలని ఇంటర్ బోర్డు.. కోర్టును కోరింది. వేలాదిమంది విద్యార్థులపై ప్రభావం పడుుతుందని ఫిబ్రవరి 27న తెలిపింది. ఏకీభవించిన కోర్టు ఏప్రిల్ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత చర్యలకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.