Begin typing your search above and press return to search.
వైద్య చరిత్రలోనే గొప్ప ఆవిష్కరణ.. ఒక్క పరీక్షతో క్యాన్సర్ గుర్తింపు
By: Tupaki Desk | 1 April 2020 4:30 PM GMTప్రపంచమంతా కరోనా వైరస్ మారు మోగుతుండగా ఈ సమయంలో ప్రాణాంతకమైన క్యాన్సర్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆ క్యాన్సర్ బారిన పడితే మనిషి దాదాపు మరణించే స్థాయికి ఉంది. కానీ కొంత నివారణకు వైద్యం అందుబాటులో ఉంది. కానీ పూర్తిగా మందు మాత్రం లేదు. నివారణ.. కట్టడికి వైద్యులు కృషి చేస్తున్నారు. ఆ క్యాన్సర్ ఏవిధంగా అటాక్ చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. మానవ శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా క్యాన్సర్ లక్షణాలు త్వరగా బయటపడవు. క్యాన్సర్ వచ్చిన వారి శరీరం దెబ్బతింటుంది. ఈ క్యాన్సర్ ముదిరిన తర్వాత బయటపడుతుంది. దీనివలనే క్యాన్సర్ బాధితులు మృతిచెందుతున్నారు. అయితే ఈ క్యాన్సర్ పరిశోధనలో తాజాగా అద్భుత ఆవిష్కరణకు నాంది పడింది. లండన్ శాస్ర్తవేత్తలు క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఓ టెస్ట్ కనిపెట్టారు. దీంతో క్యాన్సర్ పరిశోధనలో ఓ మంచి పరిణామం చోటుచేసుకుంది.
సాధారణ రక్త పరీక్షతోనే 50కి పైగా క్యాన్సర్‌లను గుర్తించవచ్చు. క్యాన్సర్ రాకముందే దాని కారకాలను గుర్తించేలా పరిశోధన చేశారు. ఈ ఒక్క టెస్ట్ ద్వారా ఎన్నోరకాల కణతులను చాలా త్వరగా, తేలికగా నిర్ధారించడానికి అవకాశం లభించింది. 99.9శాతం పాజిటివ్ వచ్చిన ఫలితాలు వస్తే క్యాన్సర్ కచ్చితమని నిర్ధారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ పరీక్షలో ఒక్క కేసు కూడా మిస్ అవ్వకుండా ఎటువంటి తప్పుడు ఫలితాలు ఇవ్వకుండా పరీక్షించాలని జాగ్రత్తలు చెబుతున్నారు. కొత్తగా కనిపెట్టిన ఈ టెస్ట్‌తో సాధారణమైన రసాయన మార్పుల తో పాటు, శరీర కణాల్లో నుండి ఉత్పత్తి అయిన డీఎన్ ఏ ని కూడా పరీక్షించగలగడానికి దోహదం చేస్తుంది.
లండన్‌లోని డానా ఫార్బర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, హార్వాడ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు, దఫ్రాన్సిస్ క్రిక్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ వారితో కలిసి 4 వేలకు పైగా నమూనాలను పరిశీలించారు. వీటిలో క్యాన్సర్ ఉన్నవారు, లేని వారి నమూనాలు కూడా సేకరించి పరీక్షించారు. ఈ పరీక్షలో భాగంగా ఊపిరితిత్తులు, అండాశయాలు, ప్రేగు లాంటి దాదాపు 50 రకాల క్యాన్సర్లను ఈ టెస్ట్ సాయం తో కనుగొనగలుగుతామని పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఈ రక్త పరీక్షలో చాలా ఎక్కువ జనాభాను పరీక్షించగలిగే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక పరీక్ష మార్కెట్‌లో కి వీలైనంత తొందరగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. వేలాది మంది రోగులపై పరీక్షించిన తర్వాత ఆ టెస్ట్‌ను అమల్లోకి తీసుకువచ్చారు. అయితే ఈ రక్త పరీక్షపై మరింత అధ్యయనం చే్యనున్నారంట.
ఈ రకమైన బ్లడ్ టెస్ట్ ప్రారంభదశలోనే ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం అందరికీ ఆశించిన స్థాయిలో ఉండనుంది. క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించడం ఎంతో గొప్ప ఆవిష్కరణ. ఈ టెస్ట్ విషయం తెలుసుకున్న వైద్యులు, వివిధ సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. వైద్య చరిత్రలోనే గొప్ప ఆవిష్కరణ అని ప్రశంసిస్తున్నారు. కోట్లాది మంది ప్రజల ప్రాణం కాపాడే అవకాశం ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ టెస్టు అందుబాటులోకి వస్తే ఇక క్యాన్సర్ తో మృతిచెందే ఘటనలు ఒక్కటి కూడా ఉండడవు.