Begin typing your search above and press return to search.
పాలేరు రేసుగుర్రాలు రెఢీ అయ్యాయి
By: Tupaki Desk | 22 April 2016 5:13 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఈ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటం తెలిసిందే. రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు టిక్కెట్టు ఇచ్చి.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ.. అలాంటి ప్రయత్నాలకు ఏ మాత్రం సుముఖంగా లేని తెలంగాణ సీఎం కేసీఆర్.. తమ పార్టీ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించటం తెలిసిందే.
తుమ్మలను బరిలోకి దించటంతో ఉప ఎన్నిక బిగ్ ఫైట్ గా మారిపోయింది. తుమ్మలకు ధీటైన అభ్యర్థుల్ని బరిలోకి దించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ తెలుగుదేశం.. తుమ్మల అంటే ఏ మాత్రం పడని నామా నాగేశ్వరరావుగా తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే.. కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. సానుభూతితో తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఇందులోభాగంగా తమ పార్టీ అభ్యర్థిగా దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డిని ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో భేటీ అయిన కాంగ్రెస్ అధినాయకత్వం.. తమ అభ్యర్థిగా సుచరితా రెడ్డిని ఎంపిక చేయాలంటూ హైకమాండ్ కు నివేదిక పంపింది. ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేని నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వాన్ని ఓకే చేస్తారని చెబుతున్నారు. ఇక.. కమ్యూనిస్ట్ లు కూడా బరిలోకి నిలవాలని డిసైడ్ అయిన నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నిక బిగ్ ఫైట్ గా మారింది.