Begin typing your search above and press return to search.
కుక్కకు కరోనా వైరస్ ... ?
By: Tupaki Desk | 5 March 2020 4:54 AM GMTకరోనా వైరస్ ...చైనాలోని వూహన్ లో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ కరోనా వైరస్ అనేది చైనాలోని గబ్బిలాలకు ఎప్పటి నుంచో ఉన్నా, ఆ వైరస్‌ని తట్టుకునే శక్తి వాటికి ఉండటంతో... గబ్బిలాలు హ్యాపీగా బతికేస్తున్నాయి. అయితే, ఇటీవల ఆ వైరస్ గబ్బిలాల నుంచీ పాములకు సోకింది. ఆ పాముల్ని చైనా, వుహాన్ నగరంలోని... హుబేయ్ మార్కెట్‌లో అమ్మారు. వాటిని జనం కొనుక్కొని తిన్నారు. అలా పాముల నుంచీ కరోనా వైరస్ ప్రజలకు సోకిందన్న అనుమానాలున్నాయి.
అయితే , తాజాగా కరోనా వైరస్, మనుషుల నుంచీ కుక్కలకు పాకుతోందా అన్న అనుమానం ఉంది. అదే జరిగితే మరింత ప్రమాదమే. ఎందుకంటే, మనుషులకు సోకితే వెంటనే ఐసోలేషన్ వార్డుకి తరలించగలం. అదే కుక్కలకు సోకితే వాటికి సోకిన విషయం కూడా మనకు తెలియదు. ఓ ఊర కుక్కకో సోకితే... అది ఊరంతా తిరుగుతూ చాలా మందికి ఆ వ్యాధిని వ్యాపింపజెయ్యగలదు. కాగా, హాంగ్ కాంగ్ లో ఓ పెంపుడు కుక్కకు ఈ వైరస్ సోకింది. రోనా సోకిన ఓ మహిళ నుంచి కుక్కకు వైరస్ వ్యాప్తి చెందిందని హాంగ్ కాంగ్ ప్రభుత్వం తెలిపింది. ఆ శునకానికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ ‘వీక్ పాజిటివ్’ అని తేలిందని హాంగ్ కాంగ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ విభాగం ప్రకటించింది.
ఇకపోతే , ప్రస్తుతం ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న , ఈ కరోనా అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకు విస్తరించింది. మొత్తం 80కిపైగా దేశాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ వైరస్ తో ప్రపంచ వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య కూడా మూడు వేలు దాటింది. అలాగే 90 వేల మందికి పైగా ఈ వ్యాధి తో బాధ పడుతున్నారు.