Begin typing your search above and press return to search.
నరమాంసభక్షకుడు.. స్నేహితులనే చంపి తిన్నాడు.. జీవితఖైదు విధించిన కోర్టు..!
By: Tupaki Desk | 13 Feb 2021 6:30 AM GMTమందు పార్టీ ఇస్తానంటూ స్నేహితులను రహస్య ప్రదేశాలకు తీసుకెళ్లి హత్యచేసి వాళ్ల మాంసాన్ని తిన్న ఓ నరరూప రాక్షసుడికి రష్యా కోర్టు జీవిత ఖైదు విధించింది.
రష్యాలోని అర్ఖంగెల్క్స్‌లో ఎడ్వర్డ్ సెలెజ్‌నెవ్(51) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు 2016, 2017 మధ్యకాలంలో తన ముగ్గురు స్నేహితులను చంపి తినేశాడు. మందు పార్టీ ఇస్తానంటూ స్నేహితులను ఆహ్వానించేవాడు. ఆ తర్వాత వాళ్లను ఏదైనా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం మత్తులో ఉన్నప్పుడు వాళ్లను హత్యచేసేవాడు. ఆ తర్వాత వాళ్ల శరీరభాగాలను ముక్కలు ముక్కలుగా చేసి .. కొన్ని తినేసి మరికొన్నింటిని సమీపంలోని కాలువల్లో పడేసేవాడు. ఇలా ముగ్గురిని చంపేశాడు.
అనంతరం మృతుల్లోనే ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి ఉండేవాడు. అయితే మృతుడి తల్లిదండ్రులు.. తమ కొడుకు ఏమయ్యాడని సెలెజ్వెన్ను అడగగా వేరే ఊరికి వెళ్లిపోయాడని అబద్ధం చెప్పాడు. అయితే ఇతడి వాలకం చూసి వాళ్లకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెలెజ్వెన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వాళ్లకు కూడా ఇలాగే సమాధానాలు చెప్పాడు. అయితే ఇతడి గురించి పోలీసులు ఆరాతీయగా వాళ్లకు కొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి.
గతంలోనూ సెలెజ్వెన్ ఇద్దరు వ్యక్తులను చంపేసిన కేసు అతడిమీద ఉంది. దీంతో పోలీసులు తమదైన స్టయిల్లో విచారణ జరపగా.. నేరం అంగీకరించాడు. మొత్తం మగ్గురిని చంపి తిన్నట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కోర్టులో హాజరు పరిచి .. సాక్ష్యాలు సమర్పించారు. కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.