Begin typing your search above and press return to search.
పేస్ బుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని కంట్రోల్ చేయలేదా?
By: Tupaki Desk | 27 Oct 2021 10:07 AM GMTప్రముఖ సోషల్ మీడియా సంస్థ పేస్ బుక్...తప్పుడు వార్తలు, విద్వేష ప్రసంగాలను, రెచ్చగొట్టే ప్రకటనలను కంట్రోల్ చేయలేక ఫేస్ బుక్ నానా కష్టాలు పడుతుంది. భారతదేశం వెలుపల కూడా సెలబ్రేషన్స్ ఆఫ్ వయోలెన్స్ కంటెంట్ ను నియంత్రించడానికి ఫేస్ బుక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇండియాలో అధికారికంగా గుర్తించిన 22 భాషల్లో తగినంత వనరులను వినియోగించడంలో వైఫల్యం, సాంస్కృతిక సున్నితత్వం లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ఈ పరిశోధన ఫలితాల తర్వాత కంపెనీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టిందని, లోతైన విశ్లేషణ చేపట్టిందని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు నాకు చెప్పారు. అంటే, భారతదేశంలో ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే విద్వేష పూరిత వార్తలను కంట్రోల్ చేయడంలో ఫేస్ బుక్ ను వనరుల కొరత ఎదుర్కుంటోందా, ఫ్యాక్ట్ చెక్ కోసం ఫేస్ బుక్ భారతదేశంలో పది సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సోషల్ నెట్ వర్క్ లలో ఫ్లాగ్ చేసిన అంశాలను ఇంగ్లీషుతోపాటు 11 భారతీయ భాషలలో వాస్తవాలను తనిఖీ చేస్తారు. అమెరికా తర్వాత ఫేస్ బుక్ కు అతి పెద్ద నెట్ వర్క్ భారతదేశమే. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం మరింత సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియాలో ఫేస్ బుక్ తో కలిసి పనిచేస్తున్న ఫ్యాక్ట్ చెక్ సంస్థలు అనుమానాస్పద వార్తలు, యూజర్లు ఫ్లాగ్ చేసిన పోస్టులను క్రాస్‌చేసి ట్యాగ్ చేస్తున్నాయి.
భారతదేశంలో సమస్య చాలా పెద్దది: ఇక్కడ విద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోని రాజకీయ పార్టీలు, నాయకులతో ముడిపడిన బాట్‌లు, నకిలీ ఖాతాలు పుష్కలంగా ఉన్నాయి. ముస్లింలు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని శోధించే అంశాలతో యూజర్ల పేజీలు, గ్రూపులు నిండిపోయాయి. తప్పుడు సమాచారం ఇక్కడ వ్యవస్థీకృతంగా, జాగ్రత్తగా సాగిస్తున్న ఆపరేషన్. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వైరస్ వంటివి నకిలీ వార్తలను ప్రేరేపిస్తాయి.అలాగే, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల గౌరవం అనే ప్రాతిపదికన రాజకీయ నాయకులు పోస్ట్ చేసిన అభిప్రాయాలను, ప్రసంగాలను ఫేస్ బుక్ ఫ్యాక్ట్ చెక్ తనిఖీ చేయదు. భారతదేశపు సోషల్ మీడియాలో ఎక్కువ భాగం తప్పుడు సమాచారం పాలక పార్టీకి చెందిన రాజకీయ నాయకులే సృష్టిస్తారు. వారు ప్రభావవంతమైన వ్యక్తులు. కాబట్టి ఫేస్‌బుక్ వాటిని ఫ్యాక్ట్ చెక్ చేయదు అని ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా చెప్పారు. ఆల్ట్‌న్యూస్ అనేది ఒక ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్ సైట్.
ద్వేషపూరిత ప్రసంగాలు, ట్రోలింగ్, మైనారిటీలు, మహిళలపై దాడులతో భారతీయ ట్విట్టర్ ఒక చీకటి వ్యవస్థగా మారింది. ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయడంలో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ అతిపెద్ద క్యారియర్ గా మారింది. అయితే, గూగుల్‌కు చెందిన యూట్యూబ్ లో కూడా తప్పుడు వార్తలు, వివాదాస్పద అంశాలు ప్రచారమవుతున్నప్పటికీ, వాట్సాప్, ఫేస్ బుక్ లపై వచ్చిన వివాదాలు రాలేదు. గత సంవత్సరం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసే సైట్ లో 12 గంటల నిడివి గల ప్రత్యక్ష ప్రసార వీడియోలు ఉన్నాయి. ఫేస్ బుక్ లో ఎక్కడో సమస్య ఉంది. 34 కోట్లమంది యూజర్లతో భారతదేశం తో అతిపెద్ద మార్కెట్ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్. ఇది జనరల్ పర్పస్ సోషల్ మీడియా. యూజర్లు వ్యక్తిగత పేజీలను, గ్రూపులను ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తుంది.
2016 నుంచి ఫేస్ బుక్ 1300 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.7,400 కోట్లను ఖర్చు చేసిందని, 40,000మందిని ప్రపంచ వ్యాప్తంగా ఈ టెక్నాలజీ కోసం వినియోగించుకున్నట్లు పేర్కొంది.15,000కంటే ఎక్కువ మంది వ్యక్తులు 20 భారతీయ భాషలతో సహా 70 కంటే ఎక్కువ భాషలలో కంటెంట్ ను సమీక్షించారని ఫేస్ బుక్ ప్రతినిధి ఒకరు నాకు తెలిపారు. యూజర్లు ద్వేషపూరిత ప్రసంగాలను రిపోర్ట్ చేసినప్పుడు, ఆటోమేటెడ్ క్లాసిఫైయర్ లు థర్డ్ పార్టీ చెక్ పాయింట్ వెళ్లక ముందే వాటిని పరిశీలిస్తాయి. ఫేస్ బుక్ పాలక పక్షానికి మద్ధతుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018లో జర్నలిస్టులు సిరిల్ సామ్, పరంజోయ్ గుహా ఠాకుర్తా లు వీటిపై వరస కథనాలు రాశారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మిత్రుల సాయంతో ఫేస్ బుక్ భారతదేశంలో ఆధిపత్య స్థానాన్ని పొందింది.
ఈ అల్గారిథమ్ లు కమ్యూనిటీలను పోలరైజ్ చేసి ఎమోషనల్ వ్యసనపరులుగా మారుస్తాయి అని జర్నలిస్ట్, ఫేస్ బుక్ పర్యవేక్షణ బోర్డు సభ్యుడు అలాన్ రస్‌బ్రిడ్జర్ వ్యాఖ్యానించారు.ఎక్కడో మూలన ఉన్న కంటెంట్‌ను కూడా మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురాగలిగేది ఈ అల్గారిథమ్సే అని ఒకప్పుడు ఫేస్ బుక్ లో పని చేసిన డేటా సైంటిస్టు రోడీ లిండ్సే అన్నారు. విజిల్ బ్లోయర్ గా మారిన ఫేస్ బుక్ ప్రోడక్ట్ మేనేజర్ ఫ్రాన్సిస్ హౌజెన్ చెప్పినట్లు మనకు మానవీకరణ చెందిన సాఫ్ట్ వేర్ ఉండాలి. ఇక్కడ మనుషులు కలుసుకుని సంభాషణలు జరపాలి. మనం ఏం చేయాలో కంప్యూటర్ లు నిర్ధరించడం సరికాదు అని అన్నారు.