Begin typing your search above and press return to search.

అజిత్ వెన్నుపోటు ఊహించ లేకపోయాం ?

By:  Tupaki Desk   |   23 Nov 2019 10:32 AM GMT
అజిత్ వెన్నుపోటు ఊహించ లేకపోయాం  ?
X
రాజకీయాలలో ఏదైనా సాధ్యమే ..తాను పట్టిన కోడికి మూడు కాళ్లు అని నిరూపించగల సత్తా ఒక్క రాజకీయ నాయకులకి మాత్రమే ఉంటుంది. రాత్రి రాత్రికి పార్టీ జెండా మార్చడం వారికేమి కొత్తకాదు. కానీ , ఏ పార్టీ కి వ్యతిరేకంగా పార్టీని స్థాపించారో ..తిరిగి అదే పార్టీకి వత్తాసు పలకడం ఎంత వరకు న్యాయం. కానీ , ప్రస్తుత రాజకీయాల్లో న్యాయానికి , విలువలకి చోటు లేదు. కేవలం పదవికి మాత్రమే వ్యాల్యూవ్ ఇస్తున్నారు. ఇదే మరోసారి మహారాష్ట్ర వేదికగా నిరూపితమైంది. శుక్రవారం సాయంత్రం వరకు శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనుకుంటే ..శనివారం ఉదయం ఎన్సీపీ అధినేతకు సైతం షాక్ ఇస్తూ ..ఆ పార్టీ కీలక నేత అజిత్‌ పవార్‌ బీజేపీ కి మద్దతు ప్రకటించాడు. దీనితో సీఎం గా బీజేపీ నేత ఫడ్నవిస్ మరోసారి ప్రమాణ స్వీకారం చేసారు.

దీనిపై స్పందించిన .. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా ..అజిత్ పవార్ వెన్నుపోటుని ఉహించలేకపోయాం అంటూ అయన పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అజిత్‌ పవార్‌ నిర్ణయం పార్టీ తో పాటు తమ కుటుంబంలోనూ చీలిక తెచ్చిందని, ఇకపై తన తండ్రి అజిత్‌తో కలిసి పనిచేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇంకెవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. నా జీవితంలో ఎన్నడూ ఇంతగా మోసపోలేదు. తనకు అండగా నిలబడ్డాను. ప్రేమించాను. కానీ నాకు తిరిగి ఏం లభించిందో చూడండి అని తన కజిన్‌ అజిత్‌ పవార్‌ను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు.

అజిత్ పవార్ ..కార్యకర్తల నమ్మకాన్ని వమ్ముచేశాడని , ఇక పై ఆయనతో తమకు ఎటువంటి సంబంధాలు ఉండబోవన్నారు. కాగా బారమతి ఎంపీగా గెలుపొందిన సుప్రియ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించారు.శివసేన, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శరద్‌ పవార్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడంతో మహా రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.