Begin typing your search above and press return to search.

జగన్ పై చింతా మోహన్ అక్కసు

By:  Tupaki Desk   |   30 April 2021 1:30 AM GMT
జగన్ పై చింతా మోహన్ అక్కసు
X
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ తిరుపతి ఉప ఎన్నిక నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. వైసీపీ నాయకులు ఎన్నికల జిమ్మిక్కులు అవలబించారని ఆయన ఆరోపిస్తున్నాడు. సీఎం జగన్ వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన పార్టీ ఓటు బ్యాంకును పూర్తిగా దెబ్బతీశారని ఆయన కలత చెందారు.

మాజీ ఎంపీ చింతా మోహన్ మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పటికే వైసీపీ 3.5 లక్షలకుపైగా బోగస్ ఓటర్లను ఉప ఎన్నికలో ఉపయోగించిందని ఆరోపించారు. ఇప్పుడు సీఎం జగన్ కోర్టు కేసులపై చింతా మోహన్ ప్రత్యక్ష దాడి ప్రారంభించారు. ముఖ్యమంత్రిపై నమోదైన ఇన్ని అక్రమ ఆస్తుల కేసులను కోర్టులు ఎందుకు సున్నితంగా పరిశీలిస్తున్నాయని మాజీ ఎంపీ అడిగారు. సీఎం బెయిల్ షరతులను పూర్తిగా ఉల్లంఘించారని, అయితే సిబిఐ చర్యలు తీసుకోలేదని చింతా మోహన్ ప్రశ్నించారు.

సీఎం జగన్ సీబీఐ -ఇడి కేసులలో సహ నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులందరినీ తన ప్రభుత్వంలో నియమిస్తున్నారని చింతా మోహన్ ఆరోపించారు. అవినీతి కేసుల కారణంగా ఒకసారి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ జైలుకు వెళ్ళారని.. మరోసారి అలాంటి పరిస్థితి రావచ్చని చింతా మోహన్ ప్రస్తావించారు.బెయిల్ షరతులను సీఎం ఎలా ఉల్లంఘిస్తున్నారో కోర్టులు చూడాలని కోరారు. న్యాయస్థానాల నిబద్ధత గురించి సాధారణ ప్రజలు అడుగుతున్నారని మాజీ ఎంపీ ఆక్షేపించారు.