Begin typing your search above and press return to search.

జగన్ పై హత్యాయత్నం.. కీలక సాక్షి పరారీ

By:  Tupaki Desk   |   18 Jan 2019 4:46 AM GMT
జగన్ పై హత్యాయత్నం.. కీలక సాక్షి పరారీ
X
ఏదో జరుగుతోంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి కేసు టీడీపీ నేతలకు మెడకు చుట్టుకుంటోందా.?. అందుకే అలెర్ట్ అయిన ఏపీ సర్కారు - చంద్రబాబు హైకోర్టులో ఈ విచారణను ఎన్ ఐఏకు అప్పగించడం తప్పు అంటూ పిటీషన్ వేసిందా.?. కేంద్ర దర్యాప్తు సంస్థ పేరు చెబితేనే ఇప్పుడు టీడీపీ నేతలు ఎందుకు వణికిపోతున్నారు.? జగన్ పై దాడి కేసులో ఎవరున్నారు.? పెద్ద తలకాయలు ఉన్నాయా అన్న దానిపై అనుమానాలకు తావిచ్చేలా తాజాగా ఓ సంచలన సంఘటన చోటుచేసుకుంది.

ఎన్ ఐఏ విచారణను ఎదుర్కొన్న నిందితుడు శ్రీనివాసరావును ఇప్పటికే విచారించిన ఎన్ ఐఏ స్టేట్ మెంట్లను రికార్డు చేసింది. శ్రీనివాసరావు పనిచేస్తున్న రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరిని కూడా ఈ నెల 15 తర్వాత విచారణకు రావాలని ఎన్ ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన విచారణకు రాలేదు. ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియడం లేదు. టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే ఆయన పరారీలో ఉన్నాడని.. దేశం దాటేశాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు... ఈయన పనిచేస్తున్న రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి కీలకమన్న ఆరోపణలున్నాయి. దాడి చేసిన శ్రీనివాస్ కు ఆశ్రయం కల్పించింది హర్షవర్ధనే.ఈ నేపథ్యంలోనే హర్షవర్ధన్ ను ఎన్ ఐఏ విచారిస్తే కీలక విషయాలు బయటపడుతాయి. కానీ ఆయన పారిపోయాడు.

తాజాగా ఏపీ ప్రభుత్వం జగన్ పై దాడి కేసు విచారణను ఎన్ ఐఏకు అప్పగించవద్దంటూ హైకోర్టులో పిటీషన్ వేయడంతో దీనివెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టులో స్టే వచ్చేదాకా హర్షవర్ధన్ ను కనిపించకుండా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.