Begin typing your search above and press return to search.

ప్రకాశం లో రాజధాని పెట్టాల్సిందే... ఆమరణ నిరాహార దీక్షకి దిగిన యువనేత !

By:  Tupaki Desk   |   9 Jan 2020 6:31 AM GMT
ప్రకాశం లో రాజధాని పెట్టాల్సిందే... ఆమరణ నిరాహార దీక్షకి దిగిన యువనేత   !
X
రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధి కి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులని ఏర్పాటు చేయబోతున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ , జిఎన్ రావు కమిటీ కూడా ఏపీ కి మూడు రాజధానుల ప్రతిపాదన మంచిదే అని తేల్చేశాయి. మూడు రాజధానులు అని చెప్పినప్పటి నుండి అమరావతి లోని రాజధానిని ఉంచాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా నారా చంద్రబాబు నాయుడు . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అయితే , ఈ రెండు కమిటీలు మాత్రం న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసాయి.

అయితే , ఈ మూడు రాజధానుల పై కొంతమంది వ్యతిరేకత చూపిస్తుంటే ..మరికొంతమంది మాత్రం మద్దతు తెలుపుతున్నారు. అయినప్పటికీ కూడా ఏపీ సర్కార్ పరిపాలనా రాజధానిని విశాఖకు అతి త్వరలో తరలించేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తునట్టు తెలుస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వానికి అనుకోని సమస్య ఒకటి వచ్చింది. ఇప్పటికే మూడు రాజధానులు అంటూ మండిపోతున్న సమయంలో ప్రకాశం జిల్లా నేతలు ..తమ జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో రాజధాని ని ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపతి సతీశ్‌ ఆమరణ దీక్ష చేపట్టారు. బుధవారం ఒంగోలు లోని కలెక్టరేట్‌ ఎదుట తన మద్దతు దారులతో కలిసి ఆయన ఈ ఉద్యమం ప్రారంభించారు. మన ప్రకాశం జిల్లా- మన భవిష్యత్తు.. పేరుకే ప్రకాశం.. లేదు జిల్లా కు వికాసం.. అంటూ నినాదాలు చేశారు. శివ రామకృష్ణన్‌ కమిటీ సూచించినట్టు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండే ప్రకాశం జిల్లాలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని ఈ సందర్భం గా సతీశ్‌ డిమాండ్‌ చేశారు. కాగా, అమరావతి పరిరక్షణకు ఇదే జిల్లా కందుకూరులో టీడీపీ ఎస్సీసెల్‌ నేతలు దీక్షలు చేస్తున్నారు.