Begin typing your search above and press return to search.

వైసీపీ నినాదమూ ఒక్కటే రాజధానేనట ...?

By:  Tupaki Desk   |   2 Nov 2022 4:10 AM GMT
వైసీపీ నినాదమూ ఒక్కటే రాజధానేనట ...?
X
ఏపీలో ఏకైక రాజధాని ఉండాలని విపక్షాలు అంటున్నాయి. మూడు రాజధానులు ఏంటి విచిత్రంగా అని కూడా విమర్శలు చేస్తున్నాయి. ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికే మూడు రాజధానులు ఉంటే దేశానికి ఎన్ని ఉండాలని కూడా లాజిక్ పాయింట్ ని తీస్తున్నాయి. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి.

అయితే వైసీపీ మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎందుకు తెచ్చింది అన్నదాని మీద టీడీపీ ఎపుడూ ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అమరావతిని డెవలప్ చేస్తే దాని మీద చంద్రబాబు బ్రాండ్ ఉంటుందని, అది ఆ పార్టీకి లైఫ్ లాంగ్ పొలిటికల్ మైలేజ్ గా ఉంటుందని భావించే దాన్ని డైవర్ట్ చేయడానికి మూడు రాజధానుల కాన్సెప్ట్ ని జగన్ తెచ్చారని కూడా తమ్ముళ్ళు అంటారు.

అయితే అలా కాదు ఏపీలో మూడు ప్రధాన ప్రాంతాలు ఉన్నాయని అన్ని ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని వైసీపీ నేతలు ఇప్పటిదాకా వాదిస్తూ వచ్చారు. అదే అన్ని చోట్లా చెబుతూ వచ్చారు. కానీ ఇపుడు చూస్తే మూడు రాజధానుల వెనక ఉన్న ముసుగు ఏంటి అన్నది శ్రీకాకుళం వైసీపీ పెద్దాయన మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు తొలగించేశారు అని అంటున్నారు.

ఆయన విశాఖ రాజధాని అని జనాలకు భావోద్వేగం కలిగించే విషయంలో ఆవేశంగా ఈ మధ్య మాట్లాడుతున్నారు. దాంతో టంగ్ స్లిప్ అయి అసలు విషయం బయటపెట్టేశారు అని అంటున్నారు. అదెలా అంటే పేరుకే మిగిలిన రెండు చోట్ల రాజధానులు అని అంటున్నారు తప్ప నిజానికి రాజధాని ఒక్కటే. అసలైన రాజధాని అంటే అది విశాఖ మాత్రమే. మొత్తం పాలన అంతా విశాఖ నుంచే సాగుతుంది అని ధర్మాన వారు సెలవిచ్చేశారు.

పైగా దేశంలో ఎక్కడా మూడు రాజధానుల కాన్సెప్ట్ లేదని, ఏపీలోనూ అలాగే ఉంటుందని కూడా ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. ఏదో పేరుకు మాత్రం శాసన రాజధాని అని అమరావతిని అంటున్నారని, అలాగే కర్నూల్ న్యాయ రాజధాని అని చెబుతున్నారు కానీ రాజధాని అంటే ఒక్క విశాఖ మాత్రమే అని ఆయన చెప్పి ఉత్తరాంధ్రా జనాలకు ఏమి చైతన్యం తెచ్చారో తెలియదు కానీ ఏపీ జనాలకు మాత్రం కళ్ళు తెరిపించేసారు అని అంటున్నారు.

ఈ విధంగా చేయడం వల్ల రాయలసీమ, కోస్తా జిల్లాల వాసుల మనోభావాలను దెబ్బతీయడం కాదా అని విపక్షాలు అంటే మాత్రం దానికి ధర్మాన వారి జవాబు ఎలా ఉంటుందో. ఏది ఏమైనా వైసీపీదీ ఒక్కటే రాజధాని నినాదం, కానీ అది అమరావతి కాదు, విశాఖ మాత్రమే అన్న మాట. ధర్మాన ఇంత ఖఛ్చితంగా చెప్పాక ఎనీ డౌట్స్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.