Begin typing your search above and press return to search.

రాజధాని తరలింపు: సర్దుకుంటున్న ఐఏఎస్ లు

By:  Tupaki Desk   |   28 Dec 2019 4:43 AM GMT
రాజధాని తరలింపు: సర్దుకుంటున్న ఐఏఎస్ లు
X
అంతా అయి పోయినట్టే.. అమరావతి గంగ లో కలిసినట్టే.. అందుకే ఇప్పుడు ఆలస్యం చేయకుండా సర్దుకుంటున్నారట ఏపీ ఐఏఎస్ లు.. చంద్రబాబు మాయలో పడి అమరావతి రాజధాని అవుతోందని ప్రభుత్వం నుంచి భూములు కొన్న ఐఏఎస్ లు ఇప్పుడు గాబరా పడుతున్నారట.. అమరావతిలో ఆ భూముల్లో కొందరు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు. ఇప్పుడు పరిపాలన రాజధాని గా వైజాగ్ ఉండే అవకాశం ఉన్నందున ఈ భూములు, ప్లాట్లను అమ్మడానికి సిద్ధమయ్యారట..

విశాఖ రాజధాని గా మారితే ఐఏఎస్ లు అంతా అక్కడికే షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో అమరావతి లోని భూములు వారికి పెద్దగా ఉపయోగ పడవు. వైజాగ్ లోనే అధికారులు ఉండాల్సి వస్తుంది. దాంతో వైజాగ్ లోనే ఇప్పుడు స్థలాలు వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారట..

హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతి కి మారినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఐఏఎస్ లకు చాలా మందికి 500 చదరపు అడుగుల స్థలాలను 25లక్షల చొప్పున తీసుకొని ఇచ్చింది. ప్రభుత్వం నుంచి భూమిని కొన్న ఐఏఎస్ లు కొందరు చంద్రబాబుపై పిచ్చి నమ్మకం తో ఇళ్లను కూడా నిర్మించుకున్నారు. కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నారట.. ఇప్పుడు రాజధాని వైజాక్ వెళ్లడం తో ఆ భూములు, గృహాలు పనికి రాకుండా పోతున్నాయి.

ఇప్పుడు ఐఏఎస్ లకు వైజాగ్ లో ఇంటి స్థలాలు, ప్లాట్లు అవసరం. కాబట్టి అమరావతిలో పెట్టిన 25 లక్షల ఖర్చు అయినా రాబట్టుకోవడానికి ఈ ఫ్లాట్లను అమ్మడానికి ఐఏఎస్ అధికారులు రెడీ అయ్యారట.. దురదృష్టవశాత్తూ రాజధాని తరలింపుతో అమరావతిలో రియల్ భూమ్ ఒక్కసారిగా పడిపోయింది. ఈ భూములను కొనేవారే లేకుండా పోయారట..

ఈ భూముల కోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న ఐఏఎస్ లు తిరిగి చెల్లించడానికి ఆప సోపాలు పడుతున్నారట.. దీంతో ప్రభుత్వమే తమ భూములు కొనాలని సంప్రదింపులు జరపాలని యోచిస్తున్నారట.. ఇప్పటికే హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి భూములు కొన్నామని.. వైజాగ్ లో నివాసం ఉండడానికి అమరావతి లో భూములను తీసుకొని వైజాగ్ లో కేటాయించాలని ఐఏఎస్ లు ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టడానికి రెడీ అయ్యారట..