Begin typing your search above and press return to search.
విశాఖ రాజధాని : వైసీపీ కూశాలు కదులుతాయా...?
By: Tupaki Desk | 28 Oct 2022 1:30 AM GMTవిశాఖ రాజధాని అని వైసీపీ అంటోంది. ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల వ్యవధిలోనే మూడు రాజధానుల స్లోగన్ని బలంగా ముందుకు తెచ్చింది. దాని మీద చట్టం తెచ్చి ఆ తరువాత రద్దు చేసుకుంది. ఇక సుప్రీం కోర్టులో ప్రస్తుతం మూడు రాజధానుల వివాదం ఉంది. ఈ నేపధ్యంలో మూడు రాజధానులు ఖాయమని వైసీపీ చెబుతోంది. ఎప్పటికైనా విశాఖ రాజధాని అంటోంది. సరే ఇదంతా బాగానే ఉన్నా రాజకీయంగా వైసీపీ ఈ నిర్ణయం వల్ల మూడు ప్రధాన ప్రాంతాలలో రెండింట పాగా వేయాలని చూస్తోంది.
గ్రేటర్ రాయలసీమగా చెప్పబడుతున్న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలలో మొత్తం 74 సీట్లు ఉన్నాయి. ఉత్తరాంధ్రాలో మరో 34 సీట్లు ఉన్నాయి. అంటే టోటల్ గా 108 సీట్లు అన్న మాట. గ్రేటర్ రాయలసీమలో వైసీపీకి బలం గట్టిగానే ఉంది. అక్కడ మెజారిటీ సీట్లు లభిస్తాయి. ఇక ఉత్తరాంధ్రాలో విశాఖ రాజధాని రూపేణా మెజారిటీ సీట్లు దక్కితే కోస్తా జిల్లాలలో మిగిలిన సీట్లు లభిస్తే వందకు తగ్గకుండా ఎమ్మెల్యేలతో మరోమారు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అన్నది వైసీపీ మాస్టర్ ప్లాన్.
అంటే ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా ఈ రాజకీయ తంత్రం తమను కాపాడుతుంది అన్నదే వైసీపీ రాజకీయ వ్యూహం వెనక ఉన్న అసలైన ఉద్దేశం. ఇలా అన్నీ సవ్యంగా జరిగితే వైసీపీదే విజయం. కానీ అలా జరుగుతుందా. అమరావతి రాజధాని అంటే సెంటర్ పాయింట్. తుపాకీ ఆకారంలో విభజన ఏపీ భౌగోళిక ముఖ చిత్రం ఉంది. అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకూ చూసుకుంటే అమరావతి అందరికీ సెంటర్ పాయింట్.
ఈ విషయంలో ఎవరికీ ఎటు వంటి అనుమానాలు లేవు. రాజధాని పనుల కోసం ఇటు శ్రీకాకుళం నుంచి వచ్చే వారు అయిన అటు అనంతపురం నుంచి వచ్చేవారు అయినా దాదాపుగా సమాన దూరంలోనే అమరావతి రాజధానికి చేరుకోగలరు. లాజికల్ గా ఆలోచిస్తే బెస్ట్ ప్లేస్ అమరావతి. చంద్రబాబు కూడా పదే పదే ఆలోచించి అమరావతిని సెంటర్ పాయింట్ గా ఎంచుకుని మరీ రాజధానిగా ప్రకటించారు.
అయితే ఇపుడు కీలకమైన పరిపాలనా రాజధానిని జగన్ కనుక విశాఖపట్నం తరలిస్తే అనంతపురం సహా రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే వారి సంగతేంటి అన్నది కీలకమైన ప్రశ్న. పైగా విశాఖకు పరిపాలనా రాజధాని వెళ్తే భారీగా నష్టపోయేది రాయలసీమ వారే అని అంటున్నారు. కోస్తా వారికి దూరం పెరిగినా రాయలసీమ అంత ఉండదు.
దాంతో అసలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా సీమ ప్రాంతాల వారికే అని అంటున్నారు. దాంతో జగన్ మూడు రాజధానుల ఆశలు మళ్లీ అధికారంలోకి తీసుకురావడం సంగతి పక్కన పెడితే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమలోనే పార్టీ కూశాలు టోటల్ గా కదిలిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇప్పటికే రాయలసీమకు జగన్ మూడున్నరేళ్ల కాలంలో పెద్దగా చేసిందేమీలేదు అని అంటున్నారు. సాగు నీటి ప్రాజెక్టులు అలాగే ఉన్నాయి. పారిశ్రామికంగా కూడా పెద్దగా జరిగింది ఏమీ లేదు. కడప స్టీల్ ప్లాంట్ కి మళ్లీ శంకుస్థాపన చేశారు తప్ప దానికి అతీ గతీలేదు. అందువల్ల జగన్ విశాఖ రాజధాని నినాదం వల్ల ఉత్తరాంధ్రాలో టీడీపీ కంచుకోట ఏ మేరకు బద్ధలు అవుతుందో తెలియదు కానీ వైసీపీ కోంచుకోటలు సీమలో చిన్నాభిన్నం అవుతాయని అంటున్నారు.
దానికి బదులుగా విభజన చట్టంలో ఉన్న మేరకు కేంద్రంతో పోరాడి బుందేల్ ఖండ్ ప్యాకేజీలను సీమకు, ఉత్తరాంధ్రాలకు జగన్ కనుక సాధించి ఉంటే ఆయనకు బ్రహ్మరధం పట్టేవారని, పదేళ్ల పాటు తిరుగులేని విధంగా ఆయనే సీఎం గా ఉండేవారు అని మేధావులు అంటున్నారు.
జగన్ రెడీమేడ్ రాజధాని విశాఖ గురించి చెబుతున్నా విశాఖ లోకెట్ అయి ఉన్నది ఒక మూలన. పైగా అది ఏపీ లాంటి రాష్ట్రానికి అందరికీ అందుబాటులో ఉండేదికాదు. దాంతోనే సీమలో ఇపుడు కొత్త ఉద్యమాలు రగులుకునే చాన్స్ ఉంది అంటున్నారు. సీమవాసుల నుంచి తమకే పాలనారాజధాని కావాలని డిమాండ్లు వస్తే జగన్ ఎటూ న్యాయం చేయలేక మూడు ప్రాంతాలకు వైసీపీని దూరం చేసుకున్న వారు అవుతారు అన్న విశ్లేషణలూ ఉన్నాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.