Begin typing your search above and press return to search.

రాజధాని రాజకీయం : జగన్ విశాఖలో... బీజేపీ అమరావతిలో...?

By:  Tupaki Desk   |   27 July 2022 3:30 PM GMT
రాజధాని రాజకీయం : జగన్ విశాఖలో... బీజేపీ అమరావతిలో...?
X
ఏపీలో ఎన్నికలు ఇరవై నెలల తేడాలో జరగనున్నాయి. దాంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం ఇష్యూలను రెడీ చేసి పెట్టుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో రాజధాని ఎమోషనల్ ఇష్యూగా మారే అవకాశం ఉంది. అమరావతి ఏకైక రాజధాని అని హై కోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఏపీలో రాజకీయ పార్టీలు ఈ నినాదాన్ని వీడడంలేదు. లేటెస్ట్ గా బీజేపీ అమరావతి రాజధాని పరిసర గ్రామాలలో ఏకంగా 75 రోజుల పాదయాత్ర చేసేందుకు సిద్ధపడుతోంది.

అమరావతినే రాజధానిగా ఉంచి అభివృద్ధి చేయాలని బీజేపీ ఈ పాదయాత్ర సందర్భంగా నినదించనుంది. ఈ నెల 29న ఉండవల్లి వద్ద నుంచి ఈ పాదయాత్ర మొదలుపెడతారు. మొత్తం రాజధాని గ్రామాలన్నీ చుట్టేలా ఈ పాదయాత్రను బీజేపీ నేతలు చేయబోతున్నారు. సడెన్ గా బీజేపీ అమరావతి రాజధాని నినాదాన్ని ఎత్తుకోవడం వెనక పక్కా రాజకీయమే ఉంది అంటున్నారు.

సీఎం జగన్ ఆగస్ట్ నెలలో విశాఖకు మకాం మారుస్తారు అన్న ప్రచారం సాగుతోంది. అక్కడ క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుని ఆయన పాలిస్తారు అని చెబుతున్నారు.

టెక్నికల్ గా చూస్తే సీఎం ఎక్కుడ ఉంటే అక్కడ రాజధాని కాబట్టి విశాఖను ఆ విధంగా రాజధానిగా చేశామని వైసీపీ చెప్పుకునేందుకు ఈ కొత్త ఎత్తుగడ ఉపయోగపడుతుంది అంటున్నారు. అదే టైమ్ లో ఉత్తరాంధ్రా జిల్లాల మీద ఫోకస్ పెట్టిన వైసీపీ మరోమారు అక్కడ జెండా ఎగరేస్తే అధికారం ఖాయమని నమ్ముతోంది.

ఇక అమరావతి రాజధాని ప్రాంతాలు సమీప జిలాలలో చంద్రబాబుకు గ్రాఫ్ బాగా పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు, క్రిష్ణా ఉమ్మడి జిల్లాలలో మెజారిటీ సీట్లు టీడీపీ గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి.

దాంతో అక్కడ ఎంత చేసినా ఏ రకమైన హామీ ఇచ్చినా కూడా ఓట్లు పడవని గ్రహించే జగన్ విశాఖకు మకాం మారుస్తున్నారు అని అంటున్నారు. ఇక బీజేపీ విషయం తీసుకుంటే ఏకైక రాజధాని అమరావతి అని నినదించడం ద్వారా ఆయా జిల్లాలలో తమ పొలిటికల్ ఫొకస్ గట్టిగా చూసుకుంటే రేపటి ఎన్నికలలో ఏమైనా ఉపయోగపడుతుందేమో అని ఆలోచిస్తోంది.