Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన కెప్టెన్
By: Tupaki Desk | 18 Dec 2021 3:20 AM GMTపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ హస్తం పార్టీని టార్గెట్ చేసినట్లున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోతున్న కెప్టెన్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. తమ రెండుపార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు కేంద్ర మంత్రి, పంజాబ్ పార్టీ ఇంచార్జ్ గజేంద్రసింగ్ షెకావత్ అధికారికంగా ప్రకటించారు. ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనే విషయం తర్వాత డిసైడ్ చేస్తామన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నది కానీ అసలు అమరీందర్ పార్టీకి నేతలెవరున్నారు ?
ఎవున్నారంటే కెప్టెన్ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చారు కాబట్టి పార్టీలో చేరబోయే నేతల్లో అత్యధికులు కాంగ్రెస్ నేతలే అనటంలో సందేహంలేదు. కాంగ్రెస్ లో కెప్టెన్ వర్గంగా ముద్రపడిన మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, నేతల్లో కొందరు పంజాబ్ లోక్ కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది కార్యరూపం జరిగితే తీవ్రంగా నష్టపోయేది ముందు కాంగ్రెస్ పార్టీయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ దెబ్బకు పార్టీ ఇప్పటికే జనాల్లో గబ్బుపట్టిపోయింది. సిద్ధూ అరాచకాలతో ఇటు ప్రభుత్వం అటు పార్టీ జనాల్లో బాగా పలుచనైపోయింది. సొంత ప్రభుత్వం మీద సిద్ధూ నోటికొచ్చిన ఆరోపణలు, విమర్శలతో ప్రతిరోజు విరుచుకుపడుతున్నారు. దాంతో సిద్ధూ ఆరోపణలు, విమర్శలనే ప్రతిపక్షాలు తమ అస్త్రాలుగా మలచుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఏమి సమాధానం చెప్పాలో దిక్కుతోచటం లేదు.
ఇలాంటి నేపధ్యంలోనే జనాల్లో మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)వైపు చూస్తున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఆప్ కంఫర్టబుల్ గా అధికారంలోకి రావటమో లేకపోతే సింగిల్ లార్జెస్టు పార్టీగా నిలబడటమో జరుగుతుంది. మరప్పుడు కెప్టెన్ ఏమి చేస్తారు ? కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వస్తుంది ? అన్నదే కీలకమైంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే తాను అధికారంలోకి రావటం కెప్టెన్ కు అంత ముఖ్యం కాదు.
సీఎం కుర్చీలో నుంచి అవమానకరంగా దింపేసిన కాంగ్రెస్+సిద్ధూని దెబ్బకొట్టడమే కెప్టెన్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది. నిజానికి కెప్టెన్ మాజీ అవటంలో కాంగ్రెస్ అధిష్టానం పాత్ర తక్కువే. మొత్తం వ్యవహారాన్ని కంపుచేసిందే సిద్ధూ. సిద్ధూని టార్గెట్ చేస్తున్న కెప్టెన్ పనిలో పనిగా కాంగ్రెస్ వెంటపడ్డారు. సిద్ధూ వర్గం ఎక్కడ పోటీ చేస్తుందో గమనించి అక్కడల్లా తన మద్దతుదారులతో పోటీ చేయించాలని కెప్టెన్ డిసైడ్ అయ్యారు. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని కెప్టెన్ గట్టిగా టార్గెట్ చేసినట్లు అర్ధమైపోతోంది.