Begin typing your search above and press return to search.
హెరాయిన్ గుట్టు తేలినట్లేనా ?
By: Tupaki Desk | 13 Oct 2021 6:01 AM GMTగుజరాత్ లోని ముంద్ర పోర్టులో పట్టబడ్డ ర. 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ గుట్టు రట్టయినట్లేనా ? తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎఐ) ఉన్నతాధికారుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగుచూశాయి. తాజా సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్ధాన్ లోని హసన్ హుస్సేన్ అనే వ్యక్తినుండి భారత్ లోకి హెరాయిన్ వస్తోంది. ఇక్కడ హుస్సేన్ ప్రతినిధి అమిత్ ఆదేశాల ప్రకారం హెరాయిన్ దేశంలో ఎవరికి చేరాలో ? ఎంత సరుకు చేరాలో నిర్ణయమవుతుంది.
అమిత్ ఆదేశాలను ఆచరణలో పెట్టేది మాచవరం సుధాకర్ అని దర్యాప్తులో బయటపడింది. ముందుజాగ్రత్తగానే మాచవరం తన భార్యపేరుతో ఆషీ ట్రేడర్స్ అనే కంపెనీని విజయవాడలో రిజిస్టర్ చేసుంచాడు. ఇపుడు ముంద్రా పోర్టులో దిగిన సరుకంతా ఆషీ ట్రేడర్స్ పేరుతోనే టాల్కం పౌడర్ రూపంలో దిగుమతయ్యింది. దీనికి సంబంధించిన ఇన్వాయిస్ మొత్తంపై మాచవరం భార్య వైశాలియే సంతకాలు పెట్టినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో టాల్కం పౌడర్ రూపంలో సరుకును దింపుకోవటానికి రవాణా చేయటానికి మాత్రమే విజయవాడలోని ఆషీ ట్రేడర్స్ కంపెనీ అడ్రస్ ఉపయోగించుకుంటున్నట్లు బయటపడింది. ఈ ఏడాది జూన్ లో కూడా ఓ కన్సైన్మెంట్ ఇలాగే వచ్చినట్లు గుర్తించారు. ఆ కన్సైన్మెంట్ తాలూకు కమీషన్ పెద్దఎత్తున మాచవరం భార్య వైశాలికి హవాలా రూపంలో చేరినట్లు డీఆర్ఎఐ అధికారులు గుర్తించారు.
అంటే ఇపుడు పట్టుబడింది రెండో కన్సైన్మెంట్ అన్నమాట. కాకపోతే వాళ్ళ ఖర్మకాలి రెండో కన్సైన్మెంట్ పట్టుబడిపోయింది. వాస్తవాలు ఇలాగుంటే తెలుగుదేశంపార్టీ మాత్రం ఎలాగైనా పట్టుబడిన హెరాయిన్ను జగన్మోహన్ రెడ్డికి అంటకట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఆధారాలు లేకపోయినా నోటికొచ్చినట్లు బురదచల్లేసి ఆనందం పొందుతోంది. విజయవాడలోని ఆషీ ట్రేడర్స్ ఆఫీసులో కూడా తనిఖీలు చేశారు డీఆర్ఐ అధికారులు.
ఆఫీసులో డాక్యుమెంట్ల ఏమన్నా దొరుకుతాయేమో అని తనిఖీలు చేయటమంటే హెరాయిన్ విజయవాడకు చేరినట్లు కాదన్న కనీస ఇంగితం కూడా టీడీపీ నేతల్లో లోపించింది. పట్టుబడ్డ హెరాయిన్ కు ఏపీకి సంబంధం లేదని డీఆర్ఐ ఉన్నతాధికారులు ఇంత స్పష్టంగా ప్రకటించినా కూడా చంద్రబాబునాయుడు అండ్ కో మాత్రం ఒప్పుకోవటంలేదు. ఇపుడు పట్టుబడ్డ హెరాయిన్ ఢిల్లీలోని కుల్దీప్ సింగ్ కు అందాల్సిన సరుకుగా దర్యాప్తులో బయటపడింది. అయినా సరే టీడీపీ మాత్రం జగన్ కు ముడిపెట్టాలని విపరీతరమైన ప్రయత్నాలు చేస్తోంది.