Begin typing your search above and press return to search.
హైదరాబాదీయులకు ఏమైంది? మియాపూర్ లో కారు బీభత్సం
By: Tupaki Desk | 19 Feb 2020 6:42 AM GMTఒకటి తర్వాత ఒకటిగా హైదరాబాద్ లో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే వణుకు పుట్టాల్సిందే. మితిమీరిన వేగం.. మత్తు తో వాహనాల్ని నడుపుతున్న వారితో పాటు.. నిలువెత్తు నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు పోయేలా చేస్తుంది. గంటకు 120 కి.మీ. వేగంతో మూసాపేట ఫ్లైఓవర్ మీద నుంచి 30 అడుగుల కిందకు పడిపోయిన కారు ఉదంతం మరవకముందే.. మియాపూర్ లో దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
మితిమీరిన వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి అక్కడున్న వాహనాల్ని ఢీ కొనటమే కాదు.. ఏకంగా హోటల్లోకి దూసుకెళ్లిన వైనం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో హోటల్లో కూర్చున్న అఫ్జల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. నలుగురు ద్విచక్ర వాహనదారులకు గాయాలయ్యాయి.
పూటుగా తాగిన సంతోష్ అనే వ్యక్తి కారును వేగంగా నడిపాడు. అదుపు తప్పిన కారు.. అక్కడే ఉన్న టూవీలర్లను గుద్దుకుంటూ హోటల్లోకి దూసుకెళ్లింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. గాయ పడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు.తమ తప్పేం లేకున్నా.. ఎవరో చేసిన తప్పులకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి హైదరాబాద్ నగరం లో అంతకంతకూ పెరుగుతోంది.