Begin typing your search above and press return to search.

పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు.. 40 మందికి తీవ్ర గాయాలు !

By:  Tupaki Desk   |   23 Nov 2021 5:37 AM GMT
పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు.. 40 మందికి తీవ్ర గాయాలు !
X
అమెరికాలో జనసమూహంపై ట్రక్కులు దూసుకురావడం ఈ మధ్య తరచుగా పెరిగిపోతున్నాయి. ఆదివారం అమెరికాలోని విస్కిన్‌ స‌న్‌ లో ఓ ఉన్మాది కారుతో బీభ‌త్సం సృష్టించాడు. క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తున్న తరుణంలో క్రైస్తవులు పరేడ్ తీస్తున్నారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి ఆ పరేడ్‌ ను టార్గెట్ చేశాడు. కారులో వేగంగా దూసుకొచ్చిన ఉన్మాది పరేడ్ తీస్తున్నవారిని వెనుక నుంచి వచ్చి ఢీకొంటాడు. ఈ ఘటనలో 40 మందికి గాయపడగా ఐదుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో 20 మంది చిన్నారులు గాయపడినట్లు వెల్లడించారు.

అమెరికాలోని విస్కాన్‌ సిన్‌ రాష్ట్రంలోని మిల్‌వాకీ పట్టణం సమీపంలోని వాకేషా అనే ప్రాంతంలో ఆదివారం ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎస్‌ యూవీ నడిపిన వ్యక్తిగా భావిస్తున్న ఒకతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రకోణం ఉందా? లేదా? అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ప‌రేడ్ మీద‌కు కారు దూసుకువ‌స్తున్న స‌మ‌యంలో పోలీసులు ఆ కారుపై కాల్పులు జ‌రిపారు. ఈ కేసు విచార‌ణ‌లో ఎఫ్‌ బీఐ స‌హ‌కరిస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు. త్వరలో జరగబోయే క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరిచుకుని ఇక్కడి స్థానికులు 59వ క్రిస్మస్‌ వార్షిక పరేడ్‌ను చేసుకుంటున్నారు.

అదే సమయంలో ఒక వ్యక్తి ఎస్‌ యూవీ వాహనంలో వచ్చి అడ్డుగా ఉన్న బారీకేడ్లను అత్యంత వేగంతో కారుతో ధ్వంసం చేసి ర్యాలీగా వెళ్తున్న జనం మీదుగా పోనిచ్చాడు. దీంతో జనం హాహాకారాలతో పరుగులు తీశారు. ఐదుగురు మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు. చ‌రిత్రాత్మ‌క‌మైన వౌకేషా న‌గ‌రంలో ఉన్న కొన్ని వీధుల్లో ఆ ఊరేగింపు సాగ‌నున్న‌ది. ప‌రేడ్‌కు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ముందే రిలీజ్ చేశారు. ప‌రేడ్ ఘ‌ట‌న‌కు చెందిన విష‌యాన్ని అధ్య‌క్షుడు జో బైడెన్‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ ఘటనపై అధ్యక్షుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షాచాలని తెలిపారు. ఎటువంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు వివరించారు.