Begin typing your search above and press return to search.
నేతాజీ కారుకు ‘ఆడి’ కళ
By: Tupaki Desk | 8 Sep 2016 6:42 AM GMTచారిత్రక అంశాల్ని పరిరక్షించటంతో పశ్చిమ దేశాల వారు చూపే శ్రద్ధ అంతాఇంతా కాదు. కవులు..కళాకారులే కాదు.. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని చాలా భద్రంగా పరిరక్షిస్తుంటారు. వాటిని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచటం ద్వారా చరిత్రపై మరింత అవగాహన పెంచేలా చేస్తుంటారు. తాజాగా అలాంటి పనే ఒకటి మన దగ్గరా జరుగుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు.. ప్రతి భారతీయుడికి హీరోగా ఉండే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చెందిన కారుకు రిపేర్లు షురూ చేశారు. బోలెండంత చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కారుకు కొత్త కళ తీసుకొచ్చేందుకు ప్రఖ్యాత కార్ల సంస్థ ‘ఆడి’ ప్రయత్నిస్తోంది. గతంలో నేతాజీ వాడిన కారును తర్వాతి కాలంలో వాడకుండా వదిలేశారు.
కోల్ కతాకు చెందిన నేతాజీ పరిశోధనా సంస్థకుచెందిన అధికారులు నేతాజీ కారుకు మరమ్మతులు చేసి దాన్ని నడిపించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ కారును భవిష్యత్ తరాలకు తెలిసేలా ఉంచటం ద్వారా నేతాజీ స్ఫూర్తిలోనింపే అవకాశం ఉంది. తాజాగా చేసే మరమ్మతులతో ఈ కారు మరింత కాలం మన్నేలా చేయటమే లక్ష్యంగా చెప్పాలి.
1941లో గృహనిర్బంధంలో ఉన్న నేతాజీని ఆయన సోదరుడు కుమారుడు శిశిర్ కుమార్ బోస్ కోల్ కతా నుంచి దాటించేందుకు ఈ కారునే ఉపయోగించారు. కోల్ కతా నుంచి జార్ఖండ్ లోని గుమోహ్ కు నేతాజీని తీసుకెళ్లటంలో ఈకారు కీలకంగా వ్యవహరించింది.ఈ కారును నడిపిన ఉద్యోగి మరణించటంతో దీన్ని ఎవరూ ఉపయోగించటంలేదు. తాజాగా దీన్ని ఆడి కంపెనీ మరమ్మతులు చేసి.. కాస్త దూరమైనా కారు నడిచేలా చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ డిసెంబరు నాటికి రిపేర్లు పూర్తి అవుతాయని చెబుతున్నారు. చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలన్న భావన ఇప్పటికైనా కలిగినందుకు సంతోషించాలి. నేతాజీ కారు మాదిరే.. చారిత్రక ప్రాధాన్యం ఉన్న వస్తువల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించి.. పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.