Begin typing your search above and press return to search.
పెట్రోల్ బంకుల్లో కార్డులు తీసుకోరట
By: Tupaki Desk | 8 Jan 2017 12:35 PM GMTఅయితే.. దీన్ని మీరు కచ్ఛితంగా చదవాల్సిందే. ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం తిప్పలు తప్పవంతే. ఎందుకలా భయపెడతారన్న ఆగ్రహం వద్దు. చెప్పేది మొత్తం చదివితే మీకే విషయం ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలుస్తుంది. ఓపక్క నగదు రహిత లావాదేవీల్ని మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త.. కొత్త ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్న వేళ.. అందుకు భిన్నమైన పిలుపునిచ్చారు ఇండియన్ పెట్రోలియం డీలరస్ అసోసియేషన్.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ రోజు అర్థరాత్రి 12 గంటల నుంచి అన్ని డెబిట్.. క్రెడిట్ కార్డుల మీద పెట్రోల్.. డీజిల్ ను పోసేది లేదని తేల్చి చెబుతున్నాయి. కార్డులపై చెల్లింపులపై వసూలు చేయాల్సిన అదనపు ఛార్జీలను డీలర్ల నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పెట్రోల్ బంకు యాజమాన్యాలు చెబుతున్నయి.
తమ లావాదేవీల్లో 80 శాతం కార్డుల మీదనే జరుగుతున్నాయని.. ఇలాంటి వేళ అదనపు ఛార్జీలు డీలర్ల వద్దే వసూలు చేయటం సరికాదని చెబుతున్నారు. తమకు డీజిల్ పై 2.5 శాతం.. పెట్రోల్ పైన 3.2 శాతం చొప్పున కమిషన్ వస్తుందని.. కార్డుల మీద చార్జీల భారాన్ని తమ మీద మోపితే.. తమకు మిగిలేది ఏమీ ఉండదని వారు వాపోతున్నారు. సో.. న్యాయాన్యాయాల సంగతి ఎలా ఉన్నా.. డీజిల్.. పెట్రోల్ కొట్టించుకోవటానికి పెట్రోల్ బంకులకు వెళుతుంటే మాత్రం జేబులో డబ్బులు ఉన్నాయా? అన్నది చెక్ చేసుకోవటం మర్చిపోవద్దు.