Begin typing your search above and press return to search.

టీఎస్ ఆర్టీసీ లో కార్గో సేవలు ..జనవరి నుండే ప్రారంభం !

By:  Tupaki Desk   |   20 Dec 2019 7:35 AM GMT
టీఎస్ ఆర్టీసీ లో కార్గో సేవలు ..జనవరి నుండే ప్రారంభం !
X
ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ నష్టాల్లో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్యే కార్మికులు సమ్మె చేసిన విషయం కూడా తెలిసిందే. దీనితో ఈ సంస్థ మరింత నష్టాల్లో కూరుకుపోయింది. దీనితో ఎలాగైనా ఆర్టీసీ ని లాభాలబాట పట్టించాలని తెలంగాణ ఆర్టీసీ కొత్త వ్యాపారం మొదలు పెట్టింది. 2020 జనవరి 1వ తేదీ నుంచి సరుకు రవాణా రంగం లో.. సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.

ఇందులో భాగంగా ..ఇప్పటికే ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సులను సరుకు రవాణా బస్సులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ అధికారులు అధ్యయనం మొదలు పెట్టారు. ప్రైవేట్ ఆపరేటర్లు ఎలాంటి సరుకులను, ఏ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు? కిలో మీటర్‌ కు ఎంత ఛార్జ్ చేస్తున్నారు మొదలైన అంశాలపై డిపో మేనేజర్లు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ప్రస్తుతానికి వీటిని ‘తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసు’ అన్నపేరును వినియోగిస్తున్నారు.

అయితే.. సరుకు రవాణా బస్సులకు పూర్తిగా ఎర్ర రంగు ఉండగా.. వాహనం వెనకవైపు కొంతమేర క్రీమ్ కలర్ ఉంటుంది. అలాగే.. డ్రైవర్లకు, సిబ్బందికి డ్రెస్ కోడ్ ఉండాలని.. ఈడీలతో మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఆపరేటర్లకు ధీటుగా పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. విస్తృతమైన నెట్‌వర్క్ ఉన్నందున ఖచ్చితంగా విజయం సాధిస్తామని.. అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సురక్షిత ప్రయాణంతో పాటు సరైన సమయానికి చేర్చడంలో ఆర్టీసీకి మంచి పేరుంది. ఆ ఇమేజ్‌ని వాడుకుని లాభాలను గడించాలని చూస్తోంది ఆర్టీసీ.