Begin typing your search above and press return to search.

బిడ్డకు పాలిస్తూ యోగాసనాలు..

By:  Tupaki Desk   |   21 July 2017 5:30 PM GMT
బిడ్డకు పాలిస్తూ యోగాసనాలు..
X
అమ్మను చూస్తే ఆవిడకు ఎన్ని చేతులు ఉన్నాయా ? అని ఆశ్చర్యం కలుగుతుంది. మల్టీటాస్కింగ్ కు మాతృక మాతృమూర్తే అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ యోగి కార్లీ బెనీర్ అని చెప్పుకోవాలి. కార్లీకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే.

యోగాలో ఆరితేరిపోయిన కార్లీ ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు పాలిస్తూనే యోగాసనాలు వేస్తున్నట్లుగా కొన్ని ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రాం ఎకౌంట్లో పోస్టో చేసింది. అవిప్పుడు వైరల్ గా మారాయి. అత్యంత క్లిష్టమైన యోగాసనాలు వేస్తూనే ఆమె తన బిడ్డకు పాలిస్తుండడం.. ఆ బిడ్డ కూడా ఒళ్లో పడుకోబెట్టి తాపిస్తున్నట్లుగా హాయిగా తల్లి పాలు తాగుతుండడం చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు.

కేవలం నెల రోజుల కిందటే బిడ్డకు జన్మనిచ్చిన ఆమె అత్యంత క్లిష్టమైన యోగాసనాలను కూడా వేయడం వెనుక ఒక సందేశాత్మక ఆలోచన ఉంది. తల్లులు ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని చెప్పడం ఒక లక్ష్యమైతే.. రెండోది ఇండియా వంటి దేశాల్లో పిల్లలకు పాలివ్వడం అంటే ఒక రహస్యంగా చేయాల్సిన పనిగా భావించే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆ భావన పోగొట్టేలా ఏ పని చేస్తున్నా పిల్లలకు పాలివ్వొచ్చని చాటేందుకే ఆమె ఈ ఫొటోలను పోస్టు చేసినట్లుగా చెప్తున్నారు.