Begin typing your search above and press return to search.

ప్రధాని చెప్పినా బ్యాంకులు లైట్ తీసుకున్నాయ్

By:  Tupaki Desk   |   19 July 2016 7:37 AM GMT
ప్రధాని చెప్పినా బ్యాంకులు లైట్ తీసుకున్నాయ్
X
గతంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారి నోటి నుంచి ఏదైనా మాట వస్తే చాలు.. వాయు వేగంతో పనులు జరిగిపోయే పరిస్థితి. చూస్తుంటే.. ఇప్పుడా పరిస్థితులు కనిపించటం లేదన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇదేదో చిన్న చితకా స్థాయిలో కాకుండా ఏకంగా ప్రధాని స్థాయి వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటల్ని సైతం బ్యాంకులు పట్టించుకోకపోవటం విస్మయానికి గురి చేసే అంశంగా మారింది.

కాన్పూరుకు చెందిన సందీప్ అనే యువకుడు.. కర్రతో అద్భుతాలు సృష్టిస్తుంటాడు. ముచ్చటైన చెక్క వస్తువుల్ని తయారుచేయటమే కాదు.. వాటిపై అక్షరాలు కూడా చెక్కే నైపుణ్యం ఉంది. అతగాడు దాదాపు మూడున్నరేళ్లుగా భగవద్గీతకు చెందిన 18 భాగాలు.. 706 శ్లోకాల్ని అక్షరాలుగా చెక్క మీద చెక్కి ప్రధానికి బహుమతిగా ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీని కలుసుకున్నారు. అతడి ప్రతిభను స్వయంగా చూసిన ఆశ్చర్యపోవటమే కాదు.. అతడు చెక్కిన చెక్క ఫోటోల్ని ట్విట్టర్ లో పెట్టారు. అతనో చిన్న కార్పెంట్ ఫ్యాక్టరీ పెట్టుకునేందుకు సాయం చేస్తానని.. అతడికి లోన్ మంజూరు చేయాలని చెప్పారు. ఈనేపథ్యంలో ప్రధాని మాటలతో.. తనకు సాయం చేయాలంటూ ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కార్యక్రమం కింద లోన్ కు దరఖాస్తు చేశాడు. అయితే.. బ్యాంకు అధికారులు మాత్రం అతడి దరఖాస్తు మీద ఏ మాత్రం స్పందించని పరిస్థితి . ఈ ఉదంతం గురించి తెలిసిన వారు. మోడీ చెప్పినా బ్యాంకులు పట్టించుకోవా? అన్న విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ రాజ్యంలో ఆయన మాటల్ని సైతం బ్యాంకులు లైట్ తీసుకుంటాయే..?