Begin typing your search above and press return to search.
10 మంది ఇండోనేషియన్ల పై కేసు నమోదు..ఎందుకంటే !
By: Tupaki Desk | 7 April 2020 7:10 AM GMTకరోనా ..దేశంతో పాటుగా , తెలంగాణలో కూడా వేగంగా విజృంభిస్తుంది. ఢిల్లీ మర్కజ్ ఘటన బయటపడక ముందు కరోనా కంట్రోల్ కి వచ్చింది అని అనుకున్నారు. కానీ , ఢిల్లీ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మత ప్రచారానికని వచ్చి కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తి చేసిన పది మంది ఇండోనేసియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. మార్చి 14న కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధంగా వ్యవహరించి మతపరమైన సమావేశాల్లో పాల్గొన్నారని అన్నారు.
కరీంనగర్ కు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం. టూరిస్ట్ వీసా మీద వచ్చి పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా మసీదును సందర్శించడాన్ని పోలీసులు నేరంగా పరిగణిస్తున్నారు. సెక్షన్ 420, 269, 270, 188, యాక్ట్ 1897 సెక్షన్ 3 ప్రకారం కేసులు నమోదు చేశారు. మార్చి 14న కరీంనగర్ కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధంగా వ్యవహరించి మతపరమైన సమావేశాల్లో పాల్గొనడము తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులకు కూడా కరోనా వ్యాధి సోకేల చేసినట్లు అభియోగం పై కేసులు నమోదు చేశారు.
ఇకపోతే ఇప్పటి వరకు తెలంగాణ లో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. వీరిలో 45 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా, 11 మంది చనిపోయారు. ప్రస్తుత రాష్ట్రంలో 308 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక మరో రెండు రోజుల్లో మర్కజ్ కేసులతో లింకున్న వారందరి పరీక్షలన్నీ పూర్తవుతాయి. మరో 110 పాజిటివ్ కేసులు వచ్చే అవకాశముందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.