Begin typing your search above and press return to search.
చైనా అధ్యక్షుడిపై కేసు..సాక్షులుగా ప్రధాని మోదీ - ట్రంప్!
By: Tupaki Desk | 12 Jun 2020 5:30 PM GMTచైనా అధ్యక్షుడు జి. జిన్‌పింగ్ పై బిహార్‌లో కేసు నమోదు అయింది. ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తున్న ఈ వైరస్ వ్యాప్తికి ఆ దేశమే కారణమని ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు. వైరస్ వ్యాప్తికి చైనాను సూత్రధారిగా చేస్తూ ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్, ప్రపంచ దేశాలకు సరైన సమాచారం అందించడంలో విఫలమైనందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పై బీహార్ కు చెందిన న్యాయవాది మురాద్ అలీ స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ కేసు జూన్ 16వ తేదీన విచారణకు రానుంది. పిటిషన్ లో చైనా వైరస్ వ్యాప్తి చేసిందనడానికి ప్రధాన సాక్షులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలను పేర్కొన్నారు . ఐపీసీ 269, 270, 302, 307, 500, 504, 120బి సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసుపై ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా గతేడాది డిసెంబర్ నుంచి కరోనా వైరస్ చైనాను దాటి ప్రపంచ వ్యాప్తంగా దండయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే.