Begin typing your search above and press return to search.

మోడీకి ఉరిశిక్ష అన్నందుకు నారాయ‌ణ‌పై కేసు

By:  Tupaki Desk   |   29 Nov 2016 11:17 AM GMT
మోడీకి ఉరిశిక్ష అన్నందుకు నారాయ‌ణ‌పై కేసు
X
నోటి దుర‌ద నేత‌గా పేరున్న సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ చిక్కుల్లో ప‌డ్డారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయ‌న‌పై ఏపీలో కేసు న‌మోదైంది. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ - ప‌లువురు బీజేపీ నేతలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ర్యాలీల స‌మ‌యంలో నారాయ‌ణ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో బీజేపీ నేత‌లు ఈ కేసు పెట్టారు.

మోడీ తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని పేర్కొన్న నారాయ‌ణ అదే ఊపులో మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ర్యాలీలలో పాల్గొన్న నారాయణ.. ‘ఏ కోర్టుకు వెళ్లినా మోడీకి శిక్ష తప్పదని.. ప్రజాకోర్టుకు కనుక వస్తే మోడీకి ఉరిశిక్షే’ అని ఆయ‌న అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్న బీజేపీ నేత‌లు నారాయ‌ణ‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

కాగా నారాయ‌ణ ఇంత‌కుముందు కూడా ప‌లు నిర్ణ‌యాలపై మోడీకి వ్య‌తిరేకంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంద‌ర్భాలున్నాయి. మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే నారాయ‌ణ ఇలా ప‌లుమార్లు కేసుల్లో చిక్కుకున్నా త‌న తీరు మాత్రం మార్చుకోవ‌డం లేద‌ని... ప్ర‌ధాని స్థాయిలో ఉన్న వ్య‌క్తికి ఉరిశిక్ష ప‌డాల‌న్నట్లుగా మాట్లాడ‌డం తీవ్ర‌మైన త‌ప్పిద‌మ‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. ఇత‌ర ప్రాంతాల్లోనూ ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/