Begin typing your search above and press return to search.
చినబాబు ప్రచారం.. టీడీపీ అభ్యర్థిపై కేసు!
By: Tupaki Desk | 25 Jan 2016 7:47 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు.. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీకి బాగా పట్టున్న ఎస్ ఆర్ నగర్ లో అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు సభకు హాజరుకావటంతో తెలుగుదేశం వర్గాలు సంతోషపడ్డాయి. అయితే.. ఆ సంతోషం గంటల పాటు కూడా నిలవని పరిస్థితి.
లోకేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. చినబాబు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ కారణం ట్రాఫిక్ జామ్ అయినందుకు.. డీజేను వినియోగించటం.. జెండాల ఏర్పాటుతో పాటు పలు రూల్స్ ని బ్రేక్ చేసినట్లుగా గుర్తించిన పోలీసులు టీడీపీ అభ్యర్థి తాతినేని స్వరాజ్యంపై సెక్షన్ 188 కింద కేసును నమోదు చేశారు. చినబాబు రంగంలోకి దిగి గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేయటంతో మరింత ఉత్సాహాన్ని పెంచాల్సింది పోయి కేసులు మీద పడేలా చేయటం కాస్త ఇబ్బంది కలిగించే అంశం. ఇకనైనా.. ఎన్నికల ప్రచారం నిబంధనలకు విరుద్ధంగా లేని విధంగా లోకేశ్ బాబు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.