Begin typing your search above and press return to search.

కోడ్ ఉల్లంఘన.. ప్రకాష్ రాజ్ పై కేసు

By:  Tupaki Desk   |   9 April 2019 5:46 AM GMT
కోడ్ ఉల్లంఘన.. ప్రకాష్ రాజ్ పై కేసు
X
ప్రకాష్ రాజ్ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కేసులో బుక్ అయ్యారు. బెంగళూరు సెంట్రల్ నుంచి లోక్ సభ బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ తాజాగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. ఆయనపై అందిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. గతంలోనూ ఆయనపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు కావడం గమనార్హం.

ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి నామినేషన్ వేసే సమయంలో ఆటోలో ర్యాలీగా వచ్చారు. ఆ ఆటోకు అనుమతి తీసుకోలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. ప్రకాష్ రాజ్ మార్చి 22న జరిగిన ఈ సంఘటనపై రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇక మార్చి 12న కూడా బెంగళూరు మహాత్మాగాంధీ సర్కిల్ లో అనుమతి లేకుండా ర్యాలీలో మైక్ వినియోగించి ఓటు అభ్యర్థించాడని ఎన్నికల అధికారులకు కొందరు స్థానికులు వీడియో తీసి పంపించారు. అది రాజకీయపరమైన ర్యాలీ కానప్పటికీ మీడియా - రచయితలు - ఉద్యమకారులు - కళాకారులతో కలిసి - ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ అంటూ పబ్లిక్ ర్యాలీలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు ఎన్నికల అధికారులు వెళ్లి చూసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు రెండో కేసు నమోదు కావడంతో ప్రకాష్ రాజ్ చిక్కుల్లో పడ్డారు.