Begin typing your search above and press return to search.
రఘునందన్ పై కేసు... పోలీసులు కన్ఫ్యూజ్ అవుతున్నారా?
By: Tupaki Desk | 7 Jun 2022 6:11 AM GMTతెలంగాణ పోలీసుల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. నాలుగు రోజుల క్రితం కారులో ఒక అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం ఘటనపై బీజేపీ ఎంఎల్ఏ రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఘటనకి ఎంఎల్ఏపై కేసు పెట్టడానికి లింకు ఏమిటి ? లింకు ఏమిటంటే బాధితురాలి ఫొటో, వీడియోలను ఎంఎల్ఏ బయటపెట్టారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదుచేశారు.
ఇంతకీ విషయం ఏమిటంటే అమ్మాయిపై అఘాయిత్యం చేసింది అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన వారసులు. అత్యాచారం విషయం వెలుగుచూసిన తర్వాత పోలీసులు ఎవరిమీదా ముందు కేసులు పెట్టలేదు. ఇదే నేపథ్యంలో ఎంఎల్ఏ సీన్ లోకి ఎంటరయ్యారు. మీడియా సమావేశం పెట్టి ఎంఎల్ఏ కొన్ని ఫొటోలు, వీడియోలను ఆధారాలుగా చూపించారు. అందులో అమ్మాయి మొహం కనబడకుండానే ఎంఎల్ఏ జాగ్రత్తలు తీసుకున్నారు.
నిందితులు, వారు ప్రయాణించిన కారును మాత్రమే రఘు వీడియోల్లో చూపించారు. ఎందుకంటే వృత్తిరీత్యా రఘునందనరావు లాయర్. కాబట్టి ఎవరి ఫొటోలు, వీడియోలు చూపాలో ఎవరివి చూపకూడదో ఎంఎల్ఏకి బాగానే తెలుసు. అయితే అమ్మాయి మొహం కనబడేట్లుగా ఎంఎల్ఏ వీడియోలు బహిర్గతం చేశారంటు టీఆర్ఎస్ నేతలు గోల మొదలుపెట్టారు. దీంతో రెండు రోజుల పాటు అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాత పోలీసులు ఎంఎల్ఏపై కేసు నమోదుచేశారు.
తన మీడియా సమావేశంలో ఎంఎల్ఏ మాట్లాడుతూ నిందితులకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలన్నీంటినీ పోలీసులకు ఇవ్వటానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఎందుకంటే ఘటన బయటపడగానే నిందితులకు సంబంధించిన ఆధారాలపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
పోలీసులు వెతుకుతున్న ఆధారాల్లో కొన్ని తన దగ్గర ఉన్న ట్లు ఎంఎల్ఏ ప్రకటించారు. దాన్ని ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అసలు ఆధారాలు ఎంఎల్ఏ దగ్గరకు ఎలా చేరాయన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఎంఎల్ఏ ఇస్తానన్న ఆధారాలను పోలీసులు తీసుకోకుండా అసలు ఆధారాలు ఎలా వచ్చాయని ఎంఎల్ఏని ఆరాతీయటమే విచిత్రంగా ఉంది. ఎంఎల్ఏ కి ఆధారాలు ఎలా వస్తే పోలీసులకు ఎందుకు ? ఎంఎల్ఏ చూపించిన ఆధారాలు నిజమా కాదా అని మాత్రమే పోలీసులు నిర్ధారణ చేసుకోవాలి. నిజమైన ఆధారాలే అయితే తమ దర్యాప్తులో ఉపయోగించుకోవాలి. అంతేకానీ ఆధారాలిచ్చిన ఎంఎల్ఏపైనే కేసు పెడితే ఇక మామూలు జనాలు పోలీసులకు ఎందుకు సహకరిస్తారు ?