Begin typing your search above and press return to search.
చిన్న పిల్లలతో శృంగారం చేయించినందుకు స్టార్ నటుడిపై కేసు
By: Tupaki Desk | 6 Feb 2022 5:00 AM GMTబాలీవుడ్ తో పాటు తెలుగు ఇతర భాషల్లో కూడా నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న మహేష్ మంజ్రేకర్ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇన్నాళ్ల కెరీర్ లో ఆయన ఈ స్థాయి వివాదంలో ఇరుక్కోవడం ఇదే ప్రథమం అంటూ బాలీవుడ్ మీడియా వర్గాల వారు అంటున్నారు. అసలు విషయం ఏంటీ అంటే మహేష్ మంజ్రేకర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు ఆయన రచయిత.. నిర్మాత మరియు దర్శకుడు కూడా. తాజాగా మహేష్ మంజ్రేకర్ మరాఠిలో నే వరణ్‌భట్ లోంచా కోన్ నై కొంచా అనే సినిమా ను తెరకెక్కించాడు. ఆ సినిమాలో ఇద్దరు 13 ఏళ్ల కుర్రాళ్ల గురించి చూపించడం జరిగింది. ఆ కుర్రాళ్లు ఇద్దరు చేసే పనులతో సినిమా ను కాస్త బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేశాడు.
సినిమాలో ఆ ఇద్దరు చిన్న కుర్రాళ్లతో మహిళ వద్ద శృంగారం చేసినట్లుగా సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు కాస్త ఎబెట్టుగానే ఉన్నాయి. అలాంటి పచ్చి సన్నివేశాలు సభ్య సమాజంను నాశనం చేసే విధంగా ఉన్నాయంటూ మహిళ సంఘాల నాయకులు మరియు సామాజిక సంఘాల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ కమీషన్ మరియు బాలల కమీషన్ ఈ సినిమా పై కఠినంగా వ్యవహరించేందుకు సిద్దం అవుతున్నాయి. ట్రైలర్ లో మహిళతో ఆ పిల్లలు లైంగిక చర్యకు పాల్పడ్డట్లుగా చూపించారు. అప్పటి నుండి సినిమా గురించిన చర్చ మొదలు అయ్యింది. సినిమా పై తీవ్ర స్థాయిలో మరాఠి కి చెందిన పలు సామాజిక వర్గాలు మరియు ఇతర సంఘాలు కూడా మండి పడుతున్నాయి.
చిత్ర దర్శకుడు అయిన మహేష్ మంజ్రేకర్.. సినిమాను నిర్మించిన నిర్మాతలు ఇంకా ఆ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు మరియు చిత్ర యూనిట్ సభ్యులపై కేసు నమోదు అయ్యింది. క్షత్రియా మరాఠా సేవా సంస్థ కోర్టును ఆశ్రయించడంతో వివాదం మరింతగా ముదిరింది. చిత్రంలో ఇలాంటి సన్నివేశాలను పిల్లలతో చిత్రీకరించినందుకు గాను మేకర్స్ పై ఏకంగా ఫోక్సో కేసు గా నమోదు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. మరాఠ సినీ ఇండస్ట్రీలో ఈ వివాదం చిన్న చిన్నగా పెద్దది అవుతుంది.
సంజయ్ మంజ్రేకర్ కు కొందరు మద్దతు నిలువగా మెజార్టీ సినీ జనాలు కూడా ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. సినిమా ను బహిష్కరించాల్సిందే అంటూ మెజార్టీ మరాఠ ప్రజలు కోరుతున్నారు. ఈ సినిమాకు సెన్సార్ పూర్తి చేసిన సెన్సార్ సభ్యులను కూడా నింధితులుగా ఈ కేసులో చేర్చాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలకు ఎలా సెన్సార్ క్లియరెన్స్ ఇస్తారంటూ క్షత్రియా మరాఠా సేవా సంస్థ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.