Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో హెరిటేజ్ పై కేసులు బుక్‌!

By:  Tupaki Desk   |   24 Aug 2018 6:50 AM GMT
హైద‌రాబాద్‌ లో హెరిటేజ్ పై కేసులు బుక్‌!
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో తూనిక‌లు కొల‌త‌ల శాఖాధికారులు తాజాగా ప‌లు ప్రాంతాల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌కు చెందిన హెరిటేజ్ సంస్థ‌ల్లోనూ త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

హెరిటేజ్ బ్రాండ్ కు త‌గ్గ‌ట్లుగా షోరూం లోప‌ల ప‌రిస్థితులు లేవ‌న్న‌ట్లుగా తాజాగా బుక్ అయిన కేసుల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. రూల్స్ ను బ్రేక్ చేస్తూ.. జీఎస్టీ పేరుతో అధిక ధ‌ర‌లు వ‌సూలు చేస్తున్న విష‌యాన్ని గుర్తించారు. కేంద్రం ప‌లు వ‌స్తువుల‌పై జీఎస్టీ త‌గ్గించినా.. ఇప్ప‌టికి పాత ధ‌ర‌ల‌కే విక్ర‌యిస్తున్న‌ట్లుగా గుర్తించారు.

పాత జీఎస్టీ ధ‌ర‌ల‌కే ఇప్ప‌టికే కంటిన్యూ చేస్తున్న ప‌లు మాల్స్.. ప‌లు ఛైన్ రిటైల్ షాపుల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా జీఎస్టీ భారం త‌గ్గినా.. ధ‌ర‌ల్ని త‌గ్గించ‌కుండా అమ్ముతున్న వైనాన్ని గుర్తించి కేసులు న‌మోదుచేశారు. ఇలా కేసులు బుక్ అయిన వాటిలో హెరిటేజ్ ప్రెష్ కూడా ఉంది.

జీహెచ్ ఎంసీ ప‌రిధిలో మొత్తంగా ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్ లో రూల్స్ ను బ్రేక్ చేసిన వైనాల‌పై 18కేసులు.. హెరిటేజ్ సూప‌ర్ మార్కెట్లో 13 కేసులు.. మోర్ సూప‌ర్ మార్కెట్లో ఐదు కేసులు.. స్పెన్స‌ర్స్ ఏడు.. బిగ్ బజార్ పై 15.. విజేత సూప‌ర్ మార్కెట్ల‌తో పాటు.. మ‌హవీర్ ఎల‌క్ట్రిక‌ల్.. అండ్ హార్డ్ వేర్.. భ‌గ‌వ‌తి పెయింట‌ర్స్ అండ్ హార్డ్ వేర్ షాపుల్లో కేసులు న‌మోదు చేశారు. పేరుకు సూప‌ర్ మార్కెట్లే అయినా.. ఈ త‌ర‌హా క‌క్కుర్తి ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఏంది బాబు.. మీ వాళ్ల షాపుల్లోనూ ఈ అత్రిక‌మ‌ణ‌లు ఏంది సార్‌?