Begin typing your search above and press return to search.

విజయవాడ ఘటనపై కేసు..దర్యాప్తులో కొత్త విషయాలు!

By:  Tupaki Desk   |   9 Aug 2020 9:50 AM GMT
విజయవాడ ఘటనపై కేసు..దర్యాప్తులో కొత్త విషయాలు!
X
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది సజీవదహనం అవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్ ఈ ఘటనపై కేసు నమోదు చేయించి విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదైంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపబోతున్నట్టు పోలీసులు తెలిపారు.

కోవిడ్ సెంటర్ గా స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను మార్పు చేశారని.. ఇందులో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జయరాం నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం తేల్చింది. ప్రైవేట్ భవనాల్లో కోవిడ్ సెంటర్ కు నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోలేదని తేల్చారు.

ఇక అగ్ని ప్రమాదం సమయంలో సర్ణ ప్యాలెస్ లో అలారం మోగలేదని.. అలారం ఉన్న పనిచేయలేదని అధికారులు గుర్తించారు. ఇక ప్యాలెస్ భవనం వెనుక తలుపులు తెరుచుకోలేదని గుర్తించారు. ఫైర్ సేఫ్టీ లేకుండా హోటల్ ను నడుపుతున్నారనే విషయం గుర్తించారు.

ఇక రమేశ్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ కరోనా కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణం శానిటైజర్లు కూడా అని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద ఎత్తున శానిటైజర్లు నిల్వ ఉంచారని వాటి వల్లే మంటలు బాగా చెలరేగి 11 మంది మరణించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతి లేదని.. హోటల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని అదికారులు తెలిపారు.