Begin typing your search above and press return to search.
11 సెక్షన్ల కింద బాబు గోగినేనిపై కేసు
By: Tupaki Desk | 27 Jun 2018 4:54 AM GMTమానవ హక్కుల నేత, హేతువాది, బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని పై కేసు నమోదైంది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించడంతోపాటు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించారన్న ఆరోపణలపై 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హేతువాది, మానవతావాదినంటూ ప్రచారం చేసుకుంటున్న బాబు.. హైదరాబాద్ - విశాఖపట్నం - బెంగళూరుల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి ఆధార్ నంబర్లు - వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని మాదాపూర్ కు చెందిన వీర వెంకట నారాయణ కూకట్ పల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎలాంటి గుర్తింపు లేని సంస్థ నిర్వహిస్తూ బాబు గోగినేని, ఆయన అనుచరులు నేషనల్ డే ఫర్ హ్యూమనిజం - రేషనలిజమ్ - హ్యూమనిస్టుల గెట్ టుగెదర్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ మోసం చేసి ప్రజల ఆధార్ వివరాలు సేకరించారని ఆయన ఆరోపించారు.
సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారని.. దాని కోసం ఓ వెబ్ సైట్ నిర్వహిస్తున్నారని.. కానీ దాని చివరన ఎంఎల్ అని ఉండడంతో అది మలేషియా దేశానికి చెందిన వెబ్ సైట్ అని అర్థమవుతోందని నారాయణ తెలిపారు. మన ఆధార్ వివరాలను మలేషియా సైట్ లో అప్ లోడ్ చేస్తూ ఇక్కడి డేటాను విదేశాలకు పంపిస్తున్నాడని.. దీనిపై విచారణ చేయాలని కోర్టులో ఫిర్యాదు చేశానని నారాయణ పేర్కొన్నారు.
ఇక బాబు గోగినేని పై మత సంబంధ విషయాల్లో జోక్యం చేసుకోవడం పై కూడా ఫిర్యాదు చేశానని నారాయణ తెలిపారు. బాబు గోగినేని టీవీ చానళ్ల - సోషల్ మీడియా ద్వారా వివిధ మతాల మనోభావాలను కించపరుస్తున్నాడని ఆరోపించారు. ఈవెంట్ల పేరిట అమాయకులను మోసం చేసి డబ్బులు కూడా వసూలు చేశాడని మండిపడ్డారు. సౌదీ అరేబియా తీవ్రవాద దేశమని వ్యాఖ్యానించారని.. ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
కాగా బాబు గోగినేని పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ కళింగరావు తెలిపారు.