Begin typing your search above and press return to search.

పోలీసులపైకి కారు.. అఖిలప్రియ భర్తపై కేసు

By:  Tupaki Desk   |   9 Oct 2019 10:58 AM IST
పోలీసులపైకి కారు.. అఖిలప్రియ భర్తపై కేసు
X
టీడీపీ పార్టీ నేత - మాజీ మంత్రి అఖిలప్రియ భర్తపై హైదరాబాద్ లోని గచ్చిబౌళి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆళ్లగడ్డ పోలీసులపైకి కారుతో తొక్కించే యత్నం చేసిన భార్గవ్ రామ్ పై ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆళ్లగడ్డ లోని క్రషర్ విషయంలో శివరామి రెడ్డి బృందానికి - అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ లకు మధ్య ఘర్షణ జరిగింది. వీరిద్దరూ పార్టనర్స్ గా ఉన్న ఈ క్రషర్ ను తమకే ఇవ్వాలని భార్గవ్ రామ్ తన పార్టనర్ అయిన శివరామిరెడ్డిని బెదిరించి దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఈ నెల ఒకటిన భార్గవ్ పై ఆళ్లగడ్డ పీఎస్ లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న భార్గవ్ రామ్ ను పట్టుకునేందుకు హైదరాబాద్ కి వచ్చారు ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై బృందం. నిన్న సాయంత్రం బ్లాక్ ఫార్టునర్ కార్ లో డ్రైవ్ చేస్తూ కనపడిన భార్గవ రామ్ ను ఏపీ పోలీస్ టీం పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను గుర్తించిన భార్గవ్ రామ్ కారు ఆపకుండా వేగంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దారిలో దూసుకెళ్లాడు. అతడిని వెంబడించారు ఏపీ పోలీసులు. గచ్చిబౌలి లోని ఓక్ వుడ్ హోటల్ వద్ద భార్గవ కారును ఆపే ప్రయత్నం చేశారు పోలీసులు. కారు ఆపినట్లే ఆపి వేగంగా ఎస్పై పైకి కారుతో దూసుకెళ్లాడు భార్గవ రామ్. ఈ ప్రమాదం నుంచి తృటిలో ఎస్పై తప్పించుకున్నాడు.

భార్గవ్ రామ్ తన విధులకు ఆటంకం కలిగించాడని.. అరెస్ట్ చేయడానికి వచ్చిన తమను కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించాడని ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ గచ్చిబౌళి పీఎస్ లో ఫిర్యాదు చేశఆరు. దీంతో మంగళవారం భార్గవ్ రామ్ పై ఐపీసీ సెక్షన్లు 353 - 356 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.