Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు సై

By:  Tupaki Desk   |   25 Jun 2015 1:44 PM GMT
చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు సై
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడుపై కేసు న‌మోదుకు కోర్టు అనుమ‌తిచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సంద‌ర్భంగా త‌మ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వేం న‌రేంద‌ర్ రెడ్డికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌ను చంద్ర‌బాబు కోరిన‌ట్లు టేపులు విడుద‌ల అయ్యాయి. ఈ క్ర‌మంలో రంగారెడ్డి కోర్టులో న్యాయవాది భార్గవ్ ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేను కొనుగోలుచేసి ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలాగా వ్య‌వ‌హ‌రించార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు కేసు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్రంపై చంద్ర‌బాబు అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఓటుకు నోటు కేసు ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అప‌హాస్యం చేసేలా వ్య‌వ‌హ‌రించార‌ని పిటిష‌న‌ర్ ప్ర‌స్తావించారు. గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రికాద‌ని ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై కేసు న‌మోదు చేయాల‌ని న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు. దాఖ‌లైన ఫిర్యాదును విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు కేసు న‌మోదు ఫిర్యాదును విచారించింది. అన్ని వివ‌రాలు ప‌రిశీలించిన మీద‌ట‌.. కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులకు రంగారెడ్డి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.