Begin typing your search above and press return to search.
బాబు మెడకు చుట్టుకుంటున్న మరో కేసు!?
By: Tupaki Desk | 25 Sep 2018 4:28 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - ఆయన కుమారుడు - పంచాయతీరాజ్ - ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడబెట్టిన అక్రమాస్తులపై సీబీఐ - ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కాగితాలకే పరిమితం అయిన కంపెనీలకు అత్యంత ఖరీదైన వేల ఎకరాల భూములు కేటాయించి రూ. 25 వేల కోట్లను నారా లోకేశ్ కూడబెట్టారంటూ రిటైర్డు న్యాయాధికారి - ముందడుగు ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జె.శ్రవణ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. ఈ బాగోతానికి అధికారికంగా సీఎం చంద్రబాబు - తెరవెనుక కీలకపాత్రధారిగా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ ఆర్ టీ) సీఈఓ వేమూరి రవికుమార్ ఉన్నారని పిల్ లో ఆరోపించారు.
చంద్రబాబు - లోకేశ్ - రవికుమార్ కలిసి దురుద్దేశంతోనే ఐటీ పాలసీని రూపొందించి ప్రజలను - ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేశారని ఆరోపించారు. ఏపీఎన్ ఆర్ టీ ద్వారా వచ్చిన ఫైళ్లను సత్వరమే క్లియర్ అయ్యేలా చట్టంలో మార్పులు చేసి ఎన్నో కంపెనీలను ఆకర్షించేలా చేసి మోసానికి తెర తీశారన్నారు. విశాఖలో ఎకరం రూ.15 కోట్ల విలువైన భూమిని రూ.3.5 లక్షలకే ఇచ్చారని.. అలా మొత్తం రూ.500 కోట్ల విలువైన 40 ఎకరాల్ని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ఇన్నోవా సొల్యూషన్స్ కు ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. ఇంత ఖరీదైన భూమి ఇచ్చేందుకు విధించిన షరతులు విస్తుపోయేలా ఉన్నాయన్నారు. రెండున్నర వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ కంపెనీపై ప్రభుత్వ అజమాయిషీ ఏమీ ఉండదని - భూమిని అమ్ముకునేందుకు కూడా ఆ కంపెనీకి అధికారం వచ్చేస్తుందని.. ఇలాంటి షరతుతో రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నారా చంద్రబాబు - లోకేశ్ బాబులు అప్పనంగా ఇచ్చేశారని పిల్ లో ఆరోపించారు. టీడీపీకి నాయకుడికి చెందిన వీబీసీ ఫెర్టిలైజర్స్ కంపెనీకి రూ.100 కోట్ల విలువైన భూమి ఇచ్చేశారని - ఏపీఐఐసీ 57 - 836 ఎకరాలకు వివిధ కంపెనీలకు ఇచ్చేసిందని తెలిపారు. ఏ కంపెనీకి ఎంత భూమి ఇచ్చారో వివరాలు ఇవ్వడం లేదని - సమాచార హక్కు చట్టం కింది కోరినా ఇవ్వడం లేదని అన్నారు.
చంద్రబాబు పాలనలో అప్పులు అక్షరాలా అనూహ్యంగా రూ. 2.06 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్రం రాజ్యసభలో చెప్పిందని తెలిపారు. 2015-16 సంవత్సరంలో లోకేశ్ ఆస్తి రూ. 71.19 లక్షలు - ఆయన భార్య ఆస్తి రూ. 4.33 కోట్లుగా ఉంటే ఆ తర్వాత ఏడాది లోకేష్ బాబు ఆస్తి రూ.303.36 కోట్లకు పెరిగిపోయిందని - ఆయన భార్య బ్రాహ్మణి ఆస్తి రూ.4.33 కోట్ల నుంచి రూ.27 కోట్లకు చేరిందని తెలిపారు. ఏడీఆర్ రిపోర్టు మేరకు చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అని చెప్పారు. ఒక పక్క చంద్రబాబు - మరోవైపు ఆయన కుమారుడు లోకేశ్ ల ఆస్తి విపరీతంగా పెరిగిందని తెలిపారు. అక్రమార్జన అయితే వేల కోట్లకు చేరిందని అన్నారు. ప్రభుత్వం అప్పుల్లో ఊబిలో కూరుకుపోతుంటే వారి ఆస్తి మాత్రం పెరుగుతోందని ఆరోపించారు. ఈ బాగోతంపై సీబీఐ - ఈడీలతో కూడిన సిట్ తో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని పిల్ లో హైకోర్టును కోరారు.
కాగా.. లోకేశ్ ఎమ్మెల్సీ అయ్యాక చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించారని - వెంటనే ప్రవాస భారతీయుడు వేమూరి రవికుమార్ ను సలహాదారుడిగా నియమించడమే కాకుండా ఏపీఎన్ ఆర్ టీకి చైర్మన్ పదవి కట్టబెట్టారని కూడా అన్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ కల్పన పేరుతో కాగితాలకే పరిమితమైన షెల్ కంపెనీలకు అత్యంత ఖరీదైన భూములు కేటాయించేశారని తెలిపారు. ఉద్యోగ కల్పన చేశామని తప్పుడు లెక్కలు చెబుతున్నారని... వాస్తవానికి వేలు కాదు కదా వందల్లో కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. వ్యాజ్యంలో నారా చంద్రబాబునాయుడు - నారా లోకేశ్ - ఐటీ శాఖ మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి - ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ ఆర్ టీ) సీఈఓ వేమూరి రవికుమార్ లను వ్యక్తిగత ప్రతివాదుల్ని చేశారు. కోర్టు దీనిని విచారణకు స్వీకరించింది.