Begin typing your search above and press return to search.
కమల్ మెడకు కేసు చుట్టుకుంది
By: Tupaki Desk | 3 Nov 2017 10:24 PM ISTహిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందని వ్యాఖ్యానించిన తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కామెంట్స్ మలుపులు తిరుగుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఐపీసీ సెక్షన్ 500 - 511 - 298 - 295(ఏ) - 505(సీ) కింద కేసు నమోదు చేశారు. హిందూ ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని అతివాదులు అంగీకరించాల్సిందేనని ఓ తమిళ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ ఈ వ్యాఖలు చేశారు. రేపు ఈ కేసు విచారణ జరగనుంది.
మత విశ్వాసాలాను - మతాన్ని కించపరచడం ద్వారా ఏదైన వర్గంవారి మత భావాలను దెబ్బతీయడం అభియోగాలపై సెక్షన్ 295(ఏ) - పరుష వ్యాఖ్యలతో ఏ వ్యక్తి మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం కింద సెక్షన్ 298 - కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు శిక్ష విధించేందు - సెక్షన్ 500 - ఒక వర్గం - మతాన్ని ఇతర మతం - వర్గంపై దాడులకు పురికొల్చేలా వ్యవహరించడం అంశాలతో సెక్షన్ 505(సీ) - నేరాలకు పూనుకోవడం కింద సెక్షన్ 511 నమోదు చేస్తారు. తాజాగా ఈ అభియోగాలను అనుసరించే...కమల్‌పై కేసు నమోదు అయింది.
మరోవైపు హిందు ఉగ్రవాదం పెరిగిపోతున్నదన్న కమల్ పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అతన్ని ఉగ్రవాది - లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌తో పోల్చింది. ``అప్పట్లో కాంగ్రెస్ నేతలు చిదంబరం - సుశీల్ కుమార్ షిండే ముస్లిం ఓట్ల కోసం దేశంలో హిందూ ఉగ్రవాదం ఉన్నదని పార్లమెంట్ లోనే చెప్పారు. ఇప్పుడు కమల్ హాసన్ అలాంటి కామెంట్సే చేశాడు. ఈ వ్యాఖ్యలతో అతడు చిదంబరం, హఫీజ్ సయీద్ సరసన నిలుస్తున్నాడు`` అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో వీళ్లంతా కలిసి పాకిస్థాన్‌కు మేలు చేస్తున్నారని విమర్శించారు. `కమల్ హాసన్ కేరళలోని ఎల్ డీఎఫ్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. అందుకే ఆ రాష్ట్రంలో ఆ పార్టీ చేస్తున్న అరాచకాలు అతనికి కనిపించడం లేదు` అని ఆరోపించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలను తమిళ ప్రజలు తిప్పికొడతారు అని నరసింహారావు స్పష్టంచేశారు.