Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు: ఏ1గా నారా లోకేష్

By:  Tupaki Desk   |   20 Oct 2021 9:08 AM GMT
బ్రేకింగ్: టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు: ఏ1గా నారా లోకేష్
X
ఏపీలో రాజకీయ వేడి రగులుకుంది. పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ముఖ్యమంత్రి జగన్ పై పట్టాభి వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మంగళవారం టీడీపీ కార్యాలయాలపై కొందరు దాడులు చేయడంతో పరిస్థితి మరింత చేయి దాటింది. ఈ క్రమంలోనే టీడీపీ నేడు ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది.

తాజాగా మంగళవారం దాడికి సంబంధించి మరో సంచలనం నమోదైంది. నిన్న టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ టీడీపీ నేతలపై కేసు నమోదైంది. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు పోలీసులు. ఏ1గా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్ లను పేర్కొన్నారు. హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

నిన్న టీడీపీ ఆఫీస్ పై కొందరు కార్యకర్తల దాడి తర్వాత అక్కడికి వెళ్లిన సీఐ నాయక్ పై దాడి చేసిన కేసులో ఈ నలుగురు నేతలపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైంది.

అసలు ఎవరీ సీఐ నాయక్ అన్నది మంగళవారం టీడీపీ నేతలే చూపించారు. అతడికి, టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధం ఉందంటూ టీడీపీ నేత అశోక్ బాబు అతడి మాస్క్ తీయించి మరీ చూపించారు.

టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మంటలు మారి ఇరువర్గాల మధ్య సంఘటర్షణ చెలరేగి బంద్ లు, నిరసనలు, ధర్నాలు హౌస్ అరెస్ట్ ల వరకూ వెళ్లింది. ఇది మున్ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోనన్న ఆందోళన నెలకొంది.