Begin typing your search above and press return to search.
మరో కోణం; బాహుబలి టిక్కెట్లపై హైకోర్టుకు..!
By: Tupaki Desk | 9 July 2015 9:37 AM GMTఇప్పటివరకూ అద్భుతమైన ప్రచారంతో తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు వెండితెర మీద చూద్దామని అతృత పడిన బాహుబలి సినిమాకు సంబంధించి మరోకోణం బయటకు వచ్చింది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా విడుదలకు ముందు టన్నుల కొద్దీ న్యూస్ ప్రింట్‌తో పాటు.. లక్షలాది గంటలు టీవీ ఛానళ్లు వెచ్చించాయి.
ఇంత భారీప్రచారం తర్వాత విడుదల అవుతున్న సినిమాకు సంబంధించిన ఆసక్తి ప్రతిఒక్కరికి ఉంటుంది. అయితే.. ఈ సినిమా విడుదలకు మరో ఒకరోజు మిగిలి ఉన్న నేపథ్యంలో.. సినిమా టిక్కెట్లకు ఏర్పడిన డిమాండ్ కారణంగా బ్లాక్ టిక్కెట్లకు దారి తీయటంపై పెద్దఎత్తున అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అందరిలా కాకుండా.. సినీ ప్రేక్షకుల సంఘం అధ్యక్షుడు నరసింహారావు ఈ విషయాన్ని తెర మీదకు తీసుకొస్తూ.. హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేశారు.
బ్లాక్‌లో వేలాది రూపాయిలు (విడుదల రోజు ఒక్కో టిక్కెట్టు వెయ్యి వరకు.. అదే గురువారం రాత్రి వేసే ఫ్యాన్స్ షో అయితే ఒక్కొక్క టిక్కెట్టు రూ.2500) వసూలు చేయటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యాజ్యం వేశారు.
సినిమా థియేటర్ల దగ్గర సినిమా టిక్కెట్లు అయిపోయాయని చెబుతున్న నేపథ్యంలో.. బాహుబలి టిక్కెట్ల కోసం ఉద్రిక్తత భారీగా పెరిగిపోతోంది.జనం భారీగా రావటం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనతో పాటు.. దీని కారణంగా ఎవైనా ఇబ్బందులు ఎదురవుతాయని.. ఈ నేపథ్యంలో టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన అంశంపై విచారణ కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.