Begin typing your search above and press return to search.
బాబు మీద కేసుల మీద కేసులు?
By: Tupaki Desk | 11 July 2015 11:01 PM GMTఎవరి నోటి నుంచి ఎలాంటి మాట వచ్చినా సరే.. చట్టంలోని ఏసెక్షన్ కింద కేసు నమోదు చేయొచ్చన్న అంశంపై ఎవరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చెలరేగిపోతోంది. మిగిలిన వారితో పోలిస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెట్టే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు.
తాజాగా అత్యాధునిక సాంకేతికతతో ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు షురూ చేసిందంటూ వికీలీక్స్ నుంచి లీక్ కావటం.. తెలుగు రాజకీయాల్లో కాస్తంత కలకలం రేగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ స్పదించింది. తాజా ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ స్పందిస్తూ.. తెలంగాణలో రాష్ట్ర సర్కారును అస్థిరపరిచే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఫోన్ టాపింగ్‌సాంకేతికతను కొంటున్నారని ఆరోపించింది.
ఇలాంటి వైఖరిపై చర్యలు తీసుకోవాలని వారు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన యాభై మంది ఫోన్లను టాపింగ్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయటం.. దాన్ని కేసుగా నమోదు చేయటం జరిగిపోయాయి. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రిపై కేసు పెట్టే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెడుతున్నట్లుగా లేదే. మరి.. ఈ కేసులు బాబు మెడకు ఎంతలా చుట్టుకుంటాయో కాలమే బదులివ్వాలి.