Begin typing your search above and press return to search.
జగన్ పై ఐఏఎస్ అధికారులు తీరు చూశారా?
By: Tupaki Desk | 1 March 2017 7:17 AM GMTనిజమేనండోయ్... ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులంతా విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దండయాత్రకు సిద్ధమవుతున్నారట. ఇందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఏకే ఫరీదా నేతృత్వంలో మరికాసేపట్లో అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో మిగిలిన ఐఏఎస్ అధికారులంతా సమావేశం అవుతున్నారట. అయినా విపక్షంలోని జగన్ పై ఐఏఎస్‌ల ఆవేదనకు కారణం తెలిస్తే... కాస్తంత ఆశ్చర్యం వేయక మానదు. జేసీ బ్రదర్స్ కు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో నిన్న కృష్ణా జిల్లా నందిగామ ఆసుపత్రికి వచ్చిన జగన్ అక్కడ... మృతదేహాలకు సంబంధించిన నివేదికలను వైద్యుల నుంచి తీసుకునేందుకు యత్నించారు. అయితే అందుకు వైద్యులతో పాటు జిల్లా కలెక్టర్ బాబు.ఏ ససేమిరా అన్నారు.
అయినా విపక్ష నేత హోదాలో బాధితుల పరామర్శకు వెళ్లిన జగన్... అడిగితే అన్ని వివరాలు చూపించాల్సిన బాధ్యత అటు వైద్యులపైనే కాకుండా జిల్లా కలెక్టర్ గా ఉన్న బాబు.ఏ పైనా ఉంది. అయితే ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే మరిచిన కలెక్టర్... జగన్ చేతిలోని సదరు నివేదిక ప్రతులను లాగేసుకున్నారు. ఈ సందర్భంగా తన చేతిలోని ప్రతులను లాగేసుకుంటున్న కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్... ఆ సందర్భంగా బాబు.ఏ పై చేయి వేశారట. అంతేకాకుండా విపక్ష నేత అడిగితే కూడా నివేదికలు ఇవ్వకుండా ఉంటే... జైలుకెళ్లాల్సి ఉంటుందని జగన్ కెలెక్టర్ ను హెచ్చరించారు. అయినా వినని కలెక్టర్ జగన్ చేతుల్లోని ప్రతులను లాగేసుకుని తన పని అయిపోయిందన్నట్లుగా వ్యవహరించారు. ఇదంతా నిన్న జరిగిన వ్యవహారం.
నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనపై నిన్న రాత్రి వరకు నోరు మెదపని ఐఏఎస్ లు... నేటి ఉదయం దాకా అసలు దీనిపై స్పందించిన పాపాన పోలేదు. విధి నిర్వహణలో అధికారులు, విపక్ష నేతల మధ్య వాగ్వాదం సబబేనని... విపక్షం తన వాదన తాను వినిపిస్తుందని, ప్రభుత్వం పక్షాన వాటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, ఈ క్రమంలో కొన్ని సార్లు వివాదాలు చెలరేగుతుంటాయని అంతా అనుకున్నారు. అయితే నేటి ఉదయం జగన్ పై టీడీపీ నేతలు ఎదురు దాడి ప్రారంభించారు. ఆ వెంటనే నందిగామ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏకంగా జగన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు జగన్ పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు.
ఇలాంటి తరుణంలో ఎవరో తట్టి లేపినట్లు ఐఏఎస్ లు మేల్కొన్నారు. కలెక్టర్ హోదాలో ఉన్న బాబు.ఏ పై విపక్ష నేత జగన్ చేయి వేయడమేమిటని ఐఏఎస్ అధికారులు ప్రశ్నించారు. తమ కేడర్ అధికారిపై చేయి వేయడం సబబు కాదని వారంతా వితండ వాదనను తెరపైకి తీసుకొచ్చారు. బాబు.ఏపై చేయి వేసిన జగన్‌పై ఏ తరహా పోరాటం చేయాలన్న విషయంపై ప్రణాళిక రచించేందుకే ఐఏఎస్ లంతా సమావేశమవుతున్నారట. చూద్దాం. మరి వారు ఎలాంటి ప్రణాళిక ప్రకటిస్తారో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/